
సుందరకాండ
రచన :-పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగుపందిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
*సుందరమైనది సుందరకాండ
సుమధురమైనది సుందరకాండ
1. సీతను వెతకుచు వానరసేన
నలుదిక్కులను జల్లెడపట్టెను
మాతనుకానక కపివరజనులు
మహేంద్ర గిరిని చేరిరివారు // సుందర //
2. జటాయు సోదర సంపాతి గాంచి
విషయమేమని అడిగేనువారిని
జరిగినదానిని అతనికి తెలుప
దూరదృష్టితో సీతను కనుగొనే// సుందర //
3. దక్షిణ దిక్కున సంద్రమావల
లంకానగరము రావణనిలయము
రావణుడామెను లంకకు కొనిపోయే
రాక్షసరాజు అకృత్యముగా // సుందర //
4. అన్నియోజనములసంద్రము దాటుట
ఎటులో తెలియక కలవరపడిరి
అంజనిపుత్రుడు అది దాటుటకు
ఘనుడని పలికేను జాంబవంతుడు// సుందర //
5. తన శక్తేమిటో తేలియనివాడు
ఇతరులు చెబితే గ్రహించువాడు
అంజలి తనయుడు కొండంతాయెను
అమ్మనువెదకుచు సంద్రము సంధించే // సుందర //
6. సాగరమందున కలిగిన ఇక్కట్ల
చురుకుగ తానూ అధిగమించెను
లంకాతీరము చేరేను హనుమ
ఆనందముగా నగరును చూచెను // సుందర //
7. భీకరకాయము అణురూపముగా
మారెను వాయునందనుడు
అడ్డగించిన నగరుదేవత
లంఖిణి నణచెను హనుమంతుండు// సుందర //
8. ఘోరాకారులు కామరూపులూ
మహాక్రూరులు లంకావీరులు
బలవంతులు మాయావులువారు
ఏమార్చుటె టులని ఆలోచించేను // సుందర //
9. తాటినిపోలిన ప్రాకారమ్ములు
రక్షణ కోసం యంత్రాంగమ్ములు
నీటితొనిండిన కోట అగడ్తలు
ఈటెలనిడిన దానవవీరులు // సుందర //
10 . వనములు విహార స్థలములు
తోరణ ధ్వజ అలంకారములు
బంగరువెండీ రత్నధగధగలు
లంకానగరి పుర సౌందర్యము// సుందర //
11. భేరి నాద వాయిద్యములు
కరిరాజుల ఘింకారమ్ములు
అశ్వయోధుల వీరంగములు
అలకించెను అంజనిపుత్రుడు // సుందర //
ఇలా 201 చరణాలతో పాటలా సాగి చివరలో మంగళం తో ముగుస్తుంది .పూర్తిగా చదవాలనుకునేవారు
సుందరకాండ పుస్తకం చూడండి
*సుందరమైనది సుందరకాండ
సుమధురమైనది సుందరకాండ
1. సీతను వెతకుచు వానరసేన
నలుదిక్కులను జల్లెడపట్టెను
మాతనుకానక కపివరజనులు
మహేంద్ర గిరిని చేరిరివారు // సుందర //
2. జటాయు సోదర సంపాతి గాంచి
విషయమేమని అడిగేనువారిని
జరిగినదానిని అతనికి తెలుప
దూరదృష్టితో సీతను కనుగొనే// సుందర //
3. దక్షిణ దిక్కున సంద్రమావల
లంకానగరము రావణనిలయము
రావణుడామెను లంకకు కొనిపోయే
రాక్షసరాజు అకృత్యముగా // సుందర //
4. అన్నియోజనములసంద్రము దాటుట
ఎటులో తెలియక కలవరపడిరి
అంజనిపుత్రుడు అది దాటుటకు
ఘనుడని పలికేను జాంబవంతుడు// సుందర //
5. తన శక్తేమిటో తేలియనివాడు
ఇతరులు చెబితే గ్రహించువాడు
అంజలి తనయుడు కొండంతాయెను
అమ్మనువెదకుచు సంద్రము సంధించే // సుందర //
6. సాగరమందున కలిగిన ఇక్కట్ల
చురుకుగ తానూ అధిగమించెను
లంకాతీరము చేరేను హనుమ
ఆనందముగా నగరును చూచెను // సుందర //
7. భీకరకాయము అణురూపముగా
మారెను వాయునందనుడు
అడ్డగించిన నగరుదేవత
లంఖిణి నణచెను హనుమంతుండు// సుందర //
8. ఘోరాకారులు కామరూపులూ
మహాక్రూరులు లంకావీరులు
బలవంతులు మాయావులువారు
ఏమార్చుటె టులని ఆలోచించేను // సుందర //
9. తాటినిపోలిన ప్రాకారమ్ములు
రక్షణ కోసం యంత్రాంగమ్ములు
నీటితొనిండిన కోట అగడ్తలు
ఈటెలనిడిన దానవవీరులు // సుందర //
10 . వనములు విహార స్థలములు
తోరణ ధ్వజ అలంకారములు
బంగరువెండీ రత్నధగధగలు
లంకానగరి పుర సౌందర్యము// సుందర //
11. భేరి నాద వాయిద్యములు
కరిరాజుల ఘింకారమ్ములు
అశ్వయోధుల వీరంగములు
అలకించెను అంజనిపుత్రుడు // సుందర //
ఇలా 201 చరణాలతో పాటలా సాగి చివరలో మంగళం తో ముగుస్తుంది .పూర్తిగా చదవాలనుకునేవారు
సుందరకాండ పుస్తకం చూడండి