4, జూన్ 2010, శుక్రవారం

కవిత స్రవంతి


http://wall.alphacoders.com/images/751/75157.jpg

గతుకుల బతుకు పుస్తకం

రచన :- పి .పద్మావతి. ఎం .ఎ. తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు .


నే
చదవని బతుకు పుస్తకం
చదువుదామని
గతుకుల బతుకు పుస్తకం తెరిచాను
నా చేయి తగలగానే
అట్ట ఉడిపోయింది
పేదవాడి బతుకులాగా
అట్టతో మనకేం పనిలే అనుకోని
ముందుమాట చదువుదాం అనుకున్న
ముందుమాట అసలేలేదని
రెండు పేజీలు తిరగేస్తే తెలిసింది
పోనిలే పరిచయపత్రం అన్నా
చదవాలి అనుకున్న
గతుకుల బతుకు పుస్తకానికి
పరిచయపత్రం ఒకటా అని
నా మనసు పగలబడి నవ్వండి
అలా కాదని అసలు విషయానికి వస్తే
విషయమేలేదు అందులో
చదువుతూవుంటే
అదంతా నా కధలాగే ఉంది
ప్రతి పేదవాడి బతుకు
ఒకేలాగా ఉంటుందని
అప్పుడే నాకు తెల్సింది
బతుకు పుస్తకం మూసి
బరువుగా తలవాల్చాను

1 కామెంట్‌: