29, నవంబర్ 2011, మంగళవారం

ఉపన్యాసం

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం --
రావి చెట్టు బజార్-ఉయ్యూరు

శ్రీ హనుమద్ వ్రతం ---ఆహ్వానం
ఉయ్యూరు లో రావి చెట్టు బజారు లో వేంచేసి వున్న శ్రీ సువర్చలాంజనేయ
స్వామీ వార్ల దేవాలయం లో08 -12 -11 శని వారం మార్గ శిర
శుద్ధ త్రయోదశి ''శ్రీ హనుమద్ వ్రత ;;కార్య క్రమం
06 -12 -11 .మంగళ వారం నుండి -08 -12 -11 గురు వారం
వరకు త్రయాహ్నికం గా
నిర్వహించ బడును .మూడు రోజూ లలోను
సాయంత్రం 06 -00 - గం..ల కు ''సరస భారతి ''ఆధ్వర్యం లో సాహిత్య ,
సాంస్కృతిక కార్య క్రమములు జరుగును .భక్తులు ,సాహితీ ప్రియులు
విచ్చేసి జయప్రదం చేసి ,స్వామి వార్ల అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా
ప్రార్దిస్తున్నాం.
కార్య క్రమ వివరములు
o6 -12 -11 మంగళ వారం - --ఉదయం -05 గం .లకు --
స్వామివారికి స్నపన -మన్యు- సూక్తం తో అభిషేకం
ఉదయం -08 గం లకు - ''గంధ సింధూరం'' తో ప్రత్యెక పూజ
సాయంత్రం 06 -00 గం .లకు ''గీతా జయంతి ''సందర్భం గా
ధార్మికఉపన్యాసం
ఉపన్యాసకులు --శ్రీ మతి -పీ.పద్మావతి శర్మ ఎం.ఎ
.తెలుగు పండిట్ -విజయ వాడ
07 -12 -11 .బుధ వారం --ఉదయం 09 .గం లకు --''-వివిధ
ఫలాలతో''
విశేష అర్చన
సాయంత్రం 06 -గం .లకు --వేద పండితులచే -వేద పారాయణమ్
08 -12 -11 .గురు వారం ---ఉదయం 09 -గం .లకు
తమల పాకులతో(నాగ వల్లి )విశేష పూజ
ఉదయం 10 -గం -లకు ---శ్రీ హనుమద్ వ్రతం
సాయంత్రం 06 -గం .లకు --''కాలనీ మహిళా మండలి ''వారిచే
''శ్రీ హనుమాన్ చాలీసా ''పారాయణ -అనంతరం - ''భజన ''
-- ప్రతి రోజూ పూజ అనంతరం మంత్రపుష్పము ,తీర్ధ ప్రసాద
వినియోగముజరుగును .
ఇట్లు
గబ్బిట దుర్గా ప్రసాద్ ---
ఆలయ ధర్మ కర్త

మరియు భక్త బృందం

3, నవంబర్ 2011, గురువారం

కార్మికుడా



ప్రధాన- -------- కార్మికుడా !!ఓయి కార్మికుడా

కోరస్ !-------- కార్మికుడా ఓయి కార్మికుడా
ప్రధాన---------- దిగులు- మరచి పోవోయి
సంబరంగా
సాగవోయి !

కోరస్----------- దిగులు మరచిa పోవోయి
సంబరంగా
సాగవోయి !
అందరు
-------
కార్మికుడా !ఓయి కార్మికుడా
కార్మికుడా !ఓయి కార్మికుడా
ప్రధాన---------- మనకోసం ప్రభువులు
చట్టాలు తెచ్సినారు
కోరస్---------- మనకోసం ప్రభువులు
చట్టాలు తెచ్సినారు
ప్రదాన --------సౌఖ్యం గా బ్రతకమని
జీతాలు పెంచినారు
కోరస్-------- సౌఖ్యం గా బ్రతకమని
జీతాలు పెంచినారు
ప్రధాన------- దిగులు నీకు ఎందుకురా
కార్మికుడా !ఓయి కార్మికుడా
కోరస్ -------- దిగులు నీకు ఎందుకురా
కార్మికుడా !ఓయి కార్మికుడా
అందరు------- కార్మికుడా !ఓయి కార్మికుడా
కార్మికుడా
!ఓయి కార్మికుడా

ప్రధాన- ------- పండగలకు పబ్బాలకు
చదువులకు పెళ్లిళ్లకు
కోరస్---------- పండగలకు పబ్బాలకు
చదువులకు పెళ్లిళ్లకు
ప్రధాన--------- మనకేంతో ఆసరయై
మనవెంట నిలచేటి
కోరస్--------- మనకెంతో ఆసరయై
మనవెంట నిలచేటి
ప్రధాన--------- యజమానే దేవుడురా
కోరస్ యజమానే దేవుడురా
అందరు- ------- కార్మికుడా !ఓయి కార్మికుడా
కార్మికుడా !ఓయి కార్మికుడా
ప్రధాన--------- సమ్మెలు ధర్నాలు చేయడం
తగదు నీకు

కోరస్--------- సమ్మెలు ధర్నాలు చేయడం
తగదు
నీకు
ప్రధాన- -------- ఉత్పత్తిని ఆపేసి ప్రగతికడ్డు రావద్దు
కోరస్ ఉత్పత్తిని ఆపేసి ప్రగతికడ్డురావద్దు
అందరు------ కార్మికుడా !ఓయి కార్మికుడా
కార్మికుడా !ఓయి కార్మికుడా

4, ఆగస్టు 2011, గురువారం

పూజా స్రవంతి















పూజా పుష్పాలు
రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు
శివపూజ.
శివుని ప్రతి రోజు ఒక జిల్లే పూవుతో పూజిస్తే పది బంగారు
నాణెములు
దానంచేసినఫలితందక్కుతుంది.
ఒక
గన్నేరుపూవువెయ్యిజిల్లేడుపూలతోసమానం.
ఒక
మారేడుదళంవెయ్యిగన్నీరుపూవులతోసమానం.
ఒక
తామరపూవువెయ్యిమారేడుదళాలతోసమానం.
ఒక పొగడ పూవు
వేయ్యితామరలతో సామానం.
ఒక ఉమెత్త పూవు
వేయ్యిపొగడపూవులతోసమానం.
ఒక
ములక పూవు వేయ్యిఉమెత్తపూవులతోసమానం.
ఒక
తుమ్మిపూవువెయ్యిములకపువులతోసమానం.
ఒక
ఉత్తరేణి వేయ్యితుమ్మిపూలతోసమానం.
ఒక
దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతోసమానం.
ఒక జమ్మి పూవువెయ్యి దర్భ పూవులతో
సమానం.ఒక నల్లకలువ వెయ్యిజమ్మిపూవులతోసమానం.
వెయ్యి
నల్లకలువపూవులతోచేసిన మాలను శివునికి
సమర్పిస్తారోవారునివసిస్తారు.మొగిలి -మాధవి-
మల్లి
{మల్లె కాదు }-సన్నజాజి -ఉమ్మెంత -దిరిసెన-
సాల
-మంకెనపూవులనుశివపూజలోవాడరాదు.
మిగిలిన
పూవులను శివ పూజలోవాడవచ్చు.
విష్ణు పూజ
విష్ణుపూజకుసన్నజాజి,మల్లె,అడవిమొల్ల,పులగురివిందా,
కలిగొట్టు
,గన్నేరు,దేవకంచన,తులసి,గులాబీ,పసుపు
గోరంట
,సంపెంగ,దింతెన,అశోక,మొగిి,నాగ కేసర,
జమ్మి
పుష్పములు శ్రేష్ట్రమయినవి .
ఒక
తుమ్మి పూవుతో పూజించినపదిబంగారు నాణెములు దానం
చేసినఫలితందక్కుతుంది.
వెయ్యి
తుమ్మిపూవుల కంటే ఒకచండ్ర పూవు,
వెయ్యి
చండ్ర పూవుకంటేఒకజమ్మిపూవు,
వెయ్యి
జమ్మిపువులకంటేఒకమారేడుదళం,
వెయ్యి
మారేడుదళాలకంటేఒకఅవిసెపూవు,
వేయ్యి
అవిసెపూవులకంటేఒకనందివర్ధనం,
వెయ్యి
నందివర్దానాలకంతేఒకగన్నేరుపూవు ,
వెయ్యి
గన్నేరులకన్తేఒక సంపెంగ ,
వెయ్యి
సంపెంగలకంటే ఒక అశోకపుష్పము,
వెయ్యి
అశోకపుష్పము లకంటే ఒక తెల్లగులాబి ,
వేయ్యి తెల్లగులాబీలకంటే
ఒక పచ్చ గోరింట
వెయ్యి ప
చ్చ గోరింట ఒక తెల్లని సన్నజాజిఇలా మూడు దొంతరల మందారము ,కుందము,పద్మము ,
తామర
,మల్లె,జాజి పూవులు విష్టు పూజకు శ్రేష్ట మైనవి.
వెయ్యి
జాజి పూవులతో మాల గుచ్చి విష్ణువుకు
అలంకరించిన
వాడు విష్ణువు దగ్గరే నివసించును.అన్ని
పుష్పములతో పూజించిన ఫలము ఒక్క తులసి
దళము
తో పూజించిన వచ్చును.మందారము,జిల్లేడు,
ఉమ్మెత్త
,బూరుగ,దేవకాంచన, మొదలగు పూవులు
విష్టు పూజకు పనికి రావు....
(వసుధ మాస పత్రికలో జనవరి 2012లో ప్రచురించబడినది )

14, జులై 2011, గురువారం

సాయి భజన

సాయి భజన
రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్ .
రచయిత్రి
,గాయని , సంగీతం ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .

సాయినాధమహారాజ --సాయినాధ మహాదేవా

సాయినాధ మమబందో - సాయినాధ దయ సిందో

సాయినాధ మహాతేజా -- సాయినాధమహావీర

సాయినాధ హే రామ-- సాయినాధ హేకృష్ణ

సాయినాధపరమాత్మా -- సాయినాధ పరంధామ

kavulu

రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
అన్నారు అన్నారు కవులు
విన్నారు విన్నారు జనులు
కట్నం ఇవ్వవద్దన్నారు కవులు
కొడుక్కు కట్నం కావాలన్నారు కవులు
మారణహోమం వద్దన్నారు కవులు
కోడలిని కిరోసిన్ పోసి చంపారు కవులు
అన్నారు అన్నారు కవులు
నవ్వారు నవ్వారు జనులు
ఆడది అబలకాదన్నారు కవులు
ఇల్లాల్ని ఇల్లు కదలోద్దన్నారు కవులు
స్త్రీలో తల్లిని చెల్లిని చూడమన్నారు కవులు
తాము మాత్రం చొంగ కారుస్తారు కవులు
అన్నారు అన్నారు కవులు
రాళ్ళు రువ్వారు రువ్వారు జనులు

13, జులై 2011, బుధవారం





















వస్తాడు వస్తాడు మన సాయి

మనవెంట వస్తాడు మన సాయి !వస్తాడు!
వస్తాడు వస్తాడు వస్తాడు వస్తాడు !వస్తాడు!

పాపాలు పరిమార్చి పుణ్యాలు కలిగించి !పాపాలు!
మనకు ముక్తి నివ్వ వస్తాడు మన సాయి!వస్తాడు!

ఉరురా వెలిసాడు మన సాయి
మననుద్దరించాడు మన సాయి
ఉరురా ......వెలిసాడు...... మన..... సాయి
ఉరురా ......వెలిసాడు...... మన..... సాయి
ఉరురా వెలిసాడు మన సాయి
మననుద్దరించాడు మన సాయి!వస్తాడు!

కొండంత అండగా మన వెంట ఉంటాడు
! కొండంత!

కొంగు బంగారమై మన వెనుక వస్తాడు
!కొంగు బంగారమై!

! వస్తాడు వస్తాడు మన సాయి!