
కన్నీటి మరకలు
రచన :- పి .పద్మావతి శర్మ . ఎం .ఎ . తెలుగుపండిట్ .
రచయిత్రి , గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
కామధేనువుగా పుట్టివుంటే
దేవేంద్రుని వద్ద ఉండేదాన్ని
పూజలందుకునేదాన్ని
పారిజాతమై పుట్టివుంటే
విష్ణుపాదాల చెంత ఉండేదాన్ని
పూజ చేసేదాన్ని
ఆకుగా పుట్టివుంటే
అందరికి ఉపయోగ పడేదాన్ని
ఆనందంగా ఉండేదాన్ని
చెట్టుగా పుట్టివుంటే
పొయిలో కట్టెగా ఉండేదాన్ని
పేదవాడికి ఉపయోగ పడేదాన్ని
పుట్టగా పుట్టివుంటే
చీమలకు ఆవాసమై ఉండేదాన్ని
నాగులకు నిలయమై ఉండేదాన్ని
పక్షిగా పుట్టి వుంటే
కుహు కుహు రాగాలు తీసేదాన్ని
అందరికి ఆనందం పంచేదాన్ని
కుమ్మరి పురుగుగా పుట్టివుంటే
నేలను తవ్వేదాన్ని
రైతుకు మేలుచేసేదాన్ని
కాని ఆడదానిగా పుట్టాను
పురుషాహంకారంలో క్రుంగాను
ఏమి కాలేనిదాన్ని అయ్యాను
కామధేనువుగా పుట్టివుంటే
దేవేంద్రుని వద్ద ఉండేదాన్ని
పూజలందుకునేదాన్ని
పారిజాతమై పుట్టివుంటే
విష్ణుపాదాల చెంత ఉండేదాన్ని
పూజ చేసేదాన్ని
ఆకుగా పుట్టివుంటే
అందరికి ఉపయోగ పడేదాన్ని
ఆనందంగా ఉండేదాన్ని
చెట్టుగా పుట్టివుంటే
పొయిలో కట్టెగా ఉండేదాన్ని
పేదవాడికి ఉపయోగ పడేదాన్ని
పుట్టగా పుట్టివుంటే
చీమలకు ఆవాసమై ఉండేదాన్ని
నాగులకు నిలయమై ఉండేదాన్ని
పక్షిగా పుట్టి వుంటే
కుహు కుహు రాగాలు తీసేదాన్ని
అందరికి ఆనందం పంచేదాన్ని
కుమ్మరి పురుగుగా పుట్టివుంటే
నేలను తవ్వేదాన్ని
రైతుకు మేలుచేసేదాన్ని
కాని ఆడదానిగా పుట్టాను
పురుషాహంకారంలో క్రుంగాను
ఏమి కాలేనిదాన్ని అయ్యాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి