9, జూన్ 2013, ఆదివారం

గీతప్రవచనం


ఉయ్యురులో గీతప్రవచనం చేసినప్పటి వీడియో 



మంగాంబుధి హనుమంత నీ శరణ


           రచన -----అన్నమాచార్య 

           
           రాగం------ధర్మావతి 




మంగాంబుధి హనుమంత నీ శరణ
మంగవించిమి హనుమంత ||

బాలార్క బింబము ఫలమని పట్టిన
ఆలరిచేతల హనుమంతా |
తూలని బ్రహ్మాదులచే వరముల
ఓలి చేకొనిన ఓ హనుమంత ||

జలధిదాట నీ సత్వము కపులకు
అలరి తెలిసితివి హనుమంతా |
ఇలయు నాకసము నేకముగా నటు
బలిమి పెరిగితివి భళి హనుమంత ||

పాతాళము లోపలి మైరావణు-
ఆతల చంపిన హనుమంతా |
చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి-
నీతల కొలిచే హిత హనుమంత |

8, జూన్ 2013, శనివారం
















అందిచూడగ నీకు అవతారమొకటే

     రచన ---అన్నమాచార్య 


అందిచూడగ నీకు అవతారమొకటే
యెందువాడవైతివి యేటిదయ్యా


నవనీతచోర నాగపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివల కొడుకవనేదిది యేటిదయ్యా


పట్టపు శ్రీరమణ భవరోగవైద్య
జట్టిమాయలతోడి శౌరి కృష్ణ
పుట్టినచోటొకటి పొదలెడి చోటొకటి
యెట్టని నమ్మవచ్చు నిదియేటిదయ్యా


వేదాంతనిలయా వివిధాచరణ
ఆదిదేవా శ్రీవేంకటాచలేశ
సోదించి తలచినచోట నీ వుందువట
యేదెస నీ మహిమ యిదేటిదయ్యా

7, జూన్ 2013, శుక్రవారం





















ఉయ్యాల ఊపులు  ముద్దులయ్య
          రచన ---అన్నమాచార్య 
          రాగం------ఆనంద భైరవి  



ఉయ్యాల ఊపులు ముద్దులయ్య
వెయ్యారు గోపికలు వేడుకనూచెదరు

భోగీంద్రతల్పుడా భువనవిఖ్యాతా
గోగోప రక్షకా కువలయాధీశా
ఆగమసన్నుతా అచ్యుతానందా
యోగనిద్ర పోవయ్య యోగీంద్రవంద్యా

దెసలందువెలిగెటి దేవర్షివరులు
ప్రసరించి బంగారు భవనంబులోన
కొసరక నిద్రించు; గీవిందాయనుచు-
పసమీర పాడెదరు పన్నగశయనా

సన్నుతించెదరయ్య సద్భాగవతులు
పన్నగ(?) శ్రీభూమి వనితలు చేరి
ఉన్నతిపదములను వత్తెదరు నిద్రించు
వెన్నుడా ప్రసన్న వేంకటరమణా









5, జూన్ 2013, బుధవారం


నేడు పర్యావరణ దినోత్సవం 

గొప్ప అందాలను మనకోసం  సృష్టించి మనకు ఆనందం కలిగించాడు దేవుడు . కానిమనం అహంకారంతో వాటిని నాశనం చేస్తున్నాము.  పచ్చని చెట్లు కొట్టేసి ఆకాశ హర్మాలు నిర్మించుకొంటు స్దిరాస్తిని పెంచి మన ముందు తరాలకు అందిస్తున్నామని ఆనంద పడుతున్నాము . ఇది పర్యావరణానికి ఎంత చేటో అర్డంచేసుకోలేక పోతున్నాము . మనం పెంచిన ఆస్తులను మనముందు తరాల వారు అనుభవించాలని  మనం అనుకుంటే పర్యావరణాన్ని కాపాడాలి . చెట్లను ,నిటివనరులను కాపాడుకోవాలి.  గాలి కాలుష్యం తగ్గించాలి.  పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి 










ఈ రోజు పర్యావరణ దినోత్సవం . ఆ సందర్బంగా ఈ పాట.  

ఎవరు నేర్పేరమ్మ  కొమ్మకు 




సినిమా----- ఈ నాటి బంధం ఏనాటిదో(1977) 
సాహిత్యం -------: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 
సంగీతం ---------: ఎస్.రాజేశ్వరరావు గారు 
గానం---------- : పి.సుశీల గారు 

                                                                                              ఎవరు నేర్పేరమ్మ కొమ్మకు 
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ..... 
ఎవరు నేర్పేరమ్మ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు 
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ..... 
ఎవరు నేర్పేరమ్మ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు 

కొలువైతివా దేవి నాకోసము ..... 
కొలువైతివా దేవి నాకోసము 
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ 
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....  
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... 
మొల్లలివి నన్నేలు నా స్వామికి 

ఎవరు నేర్పేరమ్మ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు 
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ..... 

లీల సేవింతు ఏమనుతు కీర్తింతు ..... 
లీల సేవింతు ఏమనుతు కీర్తింతు 
సీత మనసే నీకు సింహాసనం 
ఒక పువ్వు పాదాల ..... ఒక దివ్వె నీ మ్రోల ..... 
ఒక పువ్వు పాదాల ..... ఒక దివ్వె నీ మ్రోల 
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం ..... 
ఇదే వందనం ..... 

4, జూన్ 2013, మంగళవారం


 





దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
                 
                రచన-----అన్నమాచార్య  



దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
ఈవల నీబంట నాకు నెదురింక ఏది

: కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి
ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ

: ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను
మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి
వంచించ కడమయేది వసుధాధీశ

: తగనొక్క చింతామణి తలచినట్లచేసు
మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో కొరతేది జగదేకవిభుడ

Ragam : Dharmavati , Composer : G.Balakrishnaprasad

3, జూన్ 2013, సోమవారం













హరి నీ మయమే అంతాను
             రచన -----అన్నమాచార్య 
             రాగం -----దర్బార్ కానడ 

హరి నీ మయమే అంతాను
అరసి నీకు శరణనియెద నేను


యెదుట నెవ్వరిక నే మాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను
పొదలి చదువులు పొగడీగాన

యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన
నివ్వటిల్లనది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు
యెవ్వల నని శ్రుతులెంచీగాన

భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీవేంకటేశ నాచింతయిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీగాన