24, ఆగస్టు 2013, శనివారం

అలనాటి సినిమా నటిమణులు------ టి.ఆర్.రాజకుమారి

          
          
                   
          
         టి.ఆర్.రాజకుమారి
తంజావూరు రంగనాయకి రాజకుమారి
శివకాశి (1943) చిత్రంలో రాజకుమారి
రాజకుమారి అసలు పేరుతంజావూరు రంగనాయకి రజాయి. సినిమా పేరు తంజావూరు రంగనాయకి రాజకుమారి. ఆమె 1922 వ సం !!లోతంజావూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా జన్మించింది .   ఆమె ఒక తమిళ సినిమా నటి, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 'డ్రీమ్గర్ల్' అని పిలిపించుకున్న మొదటి తార టి.ఆర్.రాజకుమారి. ఎల్.వి.ప్రసాద్దర్శకత్వంలో వచ్చిన చిత్రంలో ఆమె వసంతసేనగా 'జీవించింది'అలరించింది . చిత్రాన్ని ఆంధ్రదేశంలో నాటకంగా ప్రదర్శించినప్పుడల్లా పాత్రని జి.వరలక్ష్మి వేసేది.
రాజకుమారి 1922లో జన్మించింది. తన పిన్నిఎస్.పి.ఎల్.ధనలక్ష్మి (తమిళనటి) వల్ల సినిమారంగానికి పరిచయమైంది. రాజకుమారి మొదటి సినిమా 'కుమార కుళోత్తుంగన్' (1941). 'కచదేవయాని' చిత్రంతో తారాపథానికి వెళ్లింది. 'మంత్రావతి', 'సూర్యపుత్రి', 'మనోన్మణి', 'హరిదాస్', 'కృష్ణభక్తి' చిత్రాలు రాజకుమారిని ఆనాటి కుర్రకారుకు కలలరాణిని చేశాయి. 1948 లో విడుదలై సంచలనాత్మక విజయం సాధించిన జెమినీ వారి 'చంద్రలేఖ'లో ఈమే కథానాయిక. చిత్రం అటు తమిళనాడులోనే కాక, ఆంధ్రదేశంలోనూ రజతోత్సవం జరుపుకుంది. దాంతో రెండు భాషల్లోనూ రాజకుమారి పేరు మారుమ్రోగింది.
ఈమె కుటుంబమంతా సినిమా కుటుంబమే. అక్క ఒక తమిళనటి. అక్క కూతురు కుచలకుమారిప్రసిద్ధ సినీ నర్తకి. సోదరుడు టి.ఆర్.రామన్నతో పాటు మరో సోదరుడు టి.ఆర్.చక్రపాణి కూడా నిర్మాతే. రామన్న భార్యలు బి.ఎస్.సరోజ, .వి.సరోజ ఇద్దరూ నటీమణులే. శృంగార తారలు జ్యోతిలక్ష్మి,జయమాలిని రాజకుమారి చెల్లెలి కూతుళ్లే. రాజకుమారి వైభవంగా బతికిన రోజుల్లో మద్రాసు టి.నగర్ పాండీబజార్లో తన పేరిట 'రాజకుమారి టాకీసు' అని ఒక సినిమాహాలు కట్టించింది. ఇప్పుడు థియేటర్ స్థానంలో పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు వెలిసినా, ఇప్పటికీ 'రాజకుమారి థియేటర్ దగ్గర' అని చెప్పుకుంటారు.ఆమె వివాహం చేసుకొనలేదు 

శిల్పసుందరిలా తీర్చినట్టుండే రాజకుమారికి చివరి రోజుల్లో కుష్ఠు వ్యాధి వచ్చింది. దీంతో ఎవరినీ కలిసేది కాదామె. మరీ ఆత్మీయులెవరైనా వస్తే తెర చాటు నుంచి మాట్లాడేది. రాజసం, దర్పం, హొయలు, కవ్వించే కళ్లు, పదే పదే చూడాలనిపించే స్ఫురద్రూపం ఇవన్నీ కలబోసినట్లుండే రాజకుమారి సెప్టెంబరు 20, 1999 మరణించింది. నటించింది తక్కువ చిత్రాలే అయినా కొన్ని దశాబ్దాలకు తరగని కీర్తిని ఆర్జించుకున్న నటి ఆమె.

22, ఆగస్టు 2013, గురువారం

అలనాటి తెలుగు సినిమా నటిమణులు-------టి.జి.కమలాదేవి







టి.జి.కమలాదేవి 

టి.జి.కమలాదేవి  (.కమలా చంద్రబాబు) అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు .కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి మరియు ఆమె బిలియర్డ్స్ స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలంకార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్గా నటించింది.పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది.

టి.జి.కమలాదేవి 1930, డిసెంబర్‌ 29 తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించింది. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని కార్వేటినగరం నుండి పుత్తూరుకుమార్చాడు. తండ్రికి పుత్తూరులో అటవీ శాఖలో పని దొరికింది. కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో థర్డ్ఫారం వరకు చదివింది. క్రిస్టియన్మిషనరీ తిరిగి ఐదవక్లాస్స్కూల్లో చదివింది. ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు చెంచురామయ్య ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచుామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.
పాఠశాల, సంగీతానికి తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి జ్ఞాన సుందరినాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు నాటకం చూసారు. మరో సంఘటనలోసక్కుబాయి నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన పిఠాపురం రాజా బంగారపు గొలుసు బహూకరిస్తానని చెప్పినా, సమయానికి ఆయన మెడలో గొలుసు లేకపోవడంతో, మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించాడు. ఆంధ్ర సెక్రటరియేట్అసోసియేషన్ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.
ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్ తరపున ఓపెన్రికార్డింగ్లో పాట పాడేందుకు తొలిసారిగా చెన్నై వెళ్ళింది. టి.చలపతిరావు ఈమెకు నేను కనలేని జీవితము... అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్రికార్డింగ్లో పాడించాడు. చిన్న వయస్సులోనే కనకతార, భూపుత్రి, ఐదు పువ్వుల రాణి వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది. ఈమెకు చిన్నతనం నుండి సినిమాలంటే ఆసక్తి, ఇష్టం ఉండేది. అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్యతో జరగడంతో ఈవిడ మిగతా బాల్యం చెన్నై లోని మైలాపూర్, మాంబళంలలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే చెన్నై ఆకాశవాణి కేంద్రంలొ సంగీత, పౌరాణిక నాటకాలలొ, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది.
రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. 1950లో  సంస్థలో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేసింది.

 

1939 సంవత్సరంలో పుత్తూరులో వందేమాతరం చిత్ర కథానాయకుడు చిత్తూరు వి.నాగయ్యకు ఘన సన్మానం ఏర్పాటైంది. సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ప్రార్థనా గీతాన్ని విని, ఆమె ప్రతిభను గమనించి చెన్నై వెళ్ళాక బి.ఎన్.రెడ్డితో కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశాడు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఈమెని మద్రాసుకి పిలిపించి పాత్ర ఇద్దామనుకున్నాడు. అయితే పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే చూడామణిచిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతో 1941లో వెండితెరమీద కనిపించిన కమలాదేవి, తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకులను మైమరిపించింది. ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. తెనాలి రామకృష్ణసినిమాలో నటించి హెచ్.ఎం.రెడ్డి ఆశీస్సులు పొందింది. దక్షయజ్ఞంలో రోహిణిగా, సీతారామ జననంలోఅహల్యగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం సీతారామ జననంలో నే ధన్యనైతిని రామా అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె పార్వతీ కళ్యాణం, గరుడ గర్వభంగం,మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్లెటూరు, చక్రపాణి, తోడుదొంగలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి,పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది.

 

కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. సతీసావిత్రి, తులాభారం, కీచక వథ వంటి నాటకాలు ఈమెను నటిగా నిలబెట్టాయి. పాఠశాలలోనే కనకతార వంటి నాటకాల్లో నటిస్తూ బాల కళాకారిణి గుర్తింపు పొందింది. లవకుశ సినిమా గ్రామఫోను రికార్డు ఈమెకి మంచి పేరు తెచ్చింది. వయసు పెరిగే కొద్దీసావిత్రి, వరూధిని, కీచకవధ వంటి నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిస్తూ నటిగా పేరుతో పాటు అనుభవమూ గడించింది. అప్పటి ఆంధ్ర సెక్రటేరియట్ నాటక సమాజం ఆంధ్ర రాష్ట్రంలోనేకాక గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకంలో కమలాదేవి రుక్సానా పాత్రను 20 మార్లు నటించి, ఆపాత్రకు జీవాన్ని ఇచ్చింది. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, సి.ఎస్.ఆర్,.వి.సుబ్బారావు, రఘురామయ్య, సూరిబాబు, జగ్గయ్య వంటి మహానటుల సరసన కథానాయకిగానో, సహనటిగానో నటించి రంగస్థల చరిత్రలో తన స్థానం పదిలం చేసుకుంది. అన్నా చెల్లెలు, రోషనార, కబీరు,నూర్జహాన్, పరివర్తన వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలోను, కబీరు, నూర్జహాన్ తమిళనాడులోము మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించింది. నాటకాలలో ఆమెకు ఒక బంగారు పతకం, 25 వెండి పతకాలు లభించాయి. 1983లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఈమెకు నాటక కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించింది.

 

ఈమె తొలినుండి ఆకాశవాణి ఆస్థాన గాయని. ప్రయాగ నరసింహశాస్త్రి ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకుంది. 1945 నుంచే ఆకాశవాణిలో '' గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది బాలాంత్రపు రజనీకాంతరావు, వింజమూరి అనసూయ, సీత, రావుబాల సరస్వతీదేవి, మల్లిక్, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది. అనార్కలినాటకంలో ఆవుల చంద్రబాబునాయుడు అనే మద్రాసు కార్పొరేషన్ వాటర్ వర్క్స్ విభాగం ఇంజినీరుతో కలసి నటించింది. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. 1946అక్టోబర్ లో ఆయనతో పెళ్ళయిన తరువాత కమలాదేవి సినిమాలకు దూరమైంది. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్ నగర్ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉంది.

 

1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్ నేర్చుకుంది.  54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించింది 1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్ బాబ్ మార్షల్ తోబెంగళూరులో తలపడింది. తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది.1994, 1995లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిక్చింది. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడింది. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ, కమలాదేవి. బిలియర్డ్స్ ఆటలో 1991 లో జెంషెడ్ పూర్ లో, తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంది.
పాతాళభైరవి సినిమాలో ఇతిహాసం విన్నారా అతిసాహసులే ఉన్నారా గీతాన్ని ,ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లనగ్రోవిని ప్రియా ప్రియా అన్న దేవులపల్లిగీతాలు,దొంగలున్నారుజాగ్రత్తలో జి.వరలక్ష్మికి, భక్తరామదాసులో కన్నాంబకు, గొల్లభామలో అంజలీదేవికి 
నేపధ్య గానం చేసింది.సంపూర్ణ రామాయణంలో పద్మినికి, పాండురంగ మహత్యంలో బి.సరోజాదేవికి, ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్చెప్పింది.కంజన్ అనే తమిళ సినిమాలోనూ నటించింది.
1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పని చేసింది
చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీ కి ఈమె ఉపాధ్యక్షురాలిగా పని చేసింది.
కమలాదేవి ఆగస్టు 16, 2012 చెన్నైలో మరణించింది.