
రచన :-పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు .
తండ్రికి కూతురిగా
అన్నకు చెల్లెలిగా
తమ్ముడికి అక్కగా
మొగుడికి పెళ్లంగా
కొడుక్కు తల్లిగా
మనమడికి నానమ్మగా
ఆడదానిగా పుట్టాను
మమతలకు లొంగిపోయాను
మనసు చంపుకున్నాను
అలుసై పోయాను
ఉనికిని కోల్పోయాను
కట్టెగా మిగిలాను
ఎవరికీ అక్కరలేకపోయాను
ఎందుకు పనికిరాకపోయాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి