24, ఏప్రిల్ 2012, మంగళవారం


                     RAVIDRANAT THA GOR
రవీంద్ర నాద్ ఠాగూర్  రచించిన  మన జాతీయ గీతం   జనగణమన  పుట్టి వంద
 సంవత్సరాలుఅయ్యింది. ఉరురా నూరు సంవత్సరాల పండగ జరుపుకుంటున్నాము.
1919 లో  మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా మదనపల్లెలో  టి.బి .జబ్బుకు
 చికిత్స పొందుతూ  జనగణమననుబెంగాలి నుంచి ఇంగ్లిషు లోకి అనువాదం
 చేసారు రవీంద్ర నాద్ ఠాగూర్ . అప్పటి మనగవర్నర్గారి  భార్య  దానికి  చక్కని
 బాణీలు  కట్టి  పాడింది .అదే  ఇప్పుడు  మనం  పాడుతున్నజాతియగితం
 రవీంద్ర నాద్ ఠాగూర్   బెంగాలి నుంచి ఇంగ్లిషు లోకి అనువాదం చేసినప్పుడు
 తన స్వహస్తాలతో  రాసిన శుద్ద ప్రతి ఇది .  దీనిపై సంవత్సరము వేసి ఉంది చూడండి.
అంతే కాదు దీనిపై రవీంద్ర నాద్ ఠాగూర్  సంతకం కుడా చేసారు చూడండి.

13, ఏప్రిల్ 2012, శుక్రవారం








              ఆమెకు 76  అమె పాటకు 54 

1938 ఏప్రియల్  23 న  ఒక చిన్నారి కోయిల  గుంటూరు  జిల్లా రేపల్లె తాలుకాలో
పల్లపట్ల  గ్రామంలో పుట్టింది .తండ్రి శ్రీరామమూర్తి . శిష్ట్లవారి వంశంలో ఆరుగురు అక్క 
చెలెల్లు ముగ్గురు అన్నదమ్ముల మధ్య నాల్గవ సంతానంగా  చిన్నారి కోయిల పుట్టింది.
ఆ  చిన్నారి కోయిలే యస్ .జానకి. అందరు బాగా చదువుకున్నవారే. కాని 
జానకికే చదువు ఇష్టంలేదు. ఎప్పుడు పాటల  ధ్యాసే . రేడియో లో పాటలు శ్రద్దగా 
వినేది.జానకి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లోను ,రాజమండ్రిలోను 
నివాసం ఉన్నారు.రాజమండ్రిలో శ్రీ గొడవల్లి పైడి స్వామి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ
తీసుకున్నారు.లతా మంగేష్కర్ ,ఆశాభోసలె  పాటలు బాగా వినేవారు. ,రాజమండ్రిలో
వి.రామచంద్ర రావు (సిని దర్శకులు)ఆధ్వర్యంలో క్రాంతి కళా మండలి అనే సంస్థ ఉండేది.
అందులో కే .యల్.నరసింహారావు,పంపన సూర్యనారాయణ,జానకి పాటలు పాడేవారు.
ఒకసారి విజయనగరం లో పి.సుశీల ఆలపించిన చందన చర్చిత అష్టపతి జానకి పాడితే 
సుశీల తండ్రిగారు వచ్చి మెచ్చుకున్నారు.
      అప్పట్లోనే తల్లి మరణించగా అక్క దగ్గరకు హైదరాబాదు వెళ్లారు.బావ జి.నరసింహారావు 
ఫన్ డాక్టర్  వి.చంద్ర శేఖర్ గారికి పరిచయం చేసారు.(ఆయనే ఆ తర్వాత ఆమెకు మామగారు 
అయ్యారు.) ఆయన ఫన్ ప్రదర్శనలు ఇస్తుంటే  మేకప్ మార్చుకునే సమయంలో పాటలు 
పాడుతుండేది .  లతగారి నిదురపోరా తమ్ముడా  మేరా దిల్ ఎ పురారే మొదలైనవి పాడేది.
చంద్ర శేఖర్ గారి అబ్బాయి రాంప్రసాద్ ప్రోత్సాహంతో ఎ.వి.యం. స్టుడియోలో స్టాప్  ఆర్టిస్ట్ గా 
చేరారు. కాని వారికి మొదటి పాట పాడలేదు.4 -4 - 57  లో  టి.వి.చలపతి రావు గారి సారధ్యంలో
తమిళ పాటలు రెండు పాడారు.ఆ మరుసటి రోజే పెండ్యాల   గారి సారధ్యంలో  యం.యల్.ఎ.చిత్రం
 కోసం ఘంటసాల గారితోకలసి "నీఆస అడియాస నీ దారే మణిపూస "అనే  పాట పాడారు.ఈ
 మూడు పాటలు విషాద గీతాలే. తమిళ సినిమా విడుదల కాక పోవడంతో తెలుగు పాటే
 మొదటి పాట అయ్యింది.ఆ తర్వాత నీలి మేఘాలలో  గాలికెరటాలలో" పాట బాగా పాపులర్
 అయ్యింది. దానితో బాగా బిజీ   అయ్యింది.
        " మురిపించే మువ్వలు" చిత్రం కోసం పాడిన "నీలీల పాడేద దేవా "పాట మొదట తమిళం
 చిత్రం"కొంజుం సలంగై"లో "సింగార వేలనే  దేవా " అని  జానకి పాడింది.అది దక్షిణ దేశాన్ని ఒక
 ఉపుఉపింది.తెలుగులో కూడా అంతే.దానిలో సుబ్బారాయుడి గారి ప్రతిభే ఎక్కువ. విద్వాన్  కురిచ్చి 
అరుణాచలంగారు  నాదస్వరం వాయించారు. ఆపాట పాడటానికి మద్రాసులో గాయనిమణులు
దొరకక బొంబాయిలోకూడా వెదికారుట. అక్కడ కూడా దొరక్క మళ్ళి  మద్రాసులోనే వెదుకుతుండగా  
పి.లీల గారు జానకి చే పాడించ మన్నారుట. విచిత్రం ఏమిటంటే జానకికి తమిళంలో 2
సంవత్సరాల దాకా అవకాశాలు రాలేదు.
     "పగలే వెన్నెల" "నడిరేయి ఏజాములో" "పగలైతే దొరవేరా " "జనని వరదాయనీ "
 "కొండలన్నీ తిరిగెను కోనలన్నీతిరిగెను " వంటి మంచి పాటలు పాడారు.మొత్తం 17 భాషల
లో 17 వేల పాటలు పాడారు.అందులో 
ఇంగ్లీష్ ,జర్మన్,జపాన్ భాషలు కూడా ఉన్నాయి. 17 వేల పాటలలో 15 వేలపాటలు సినిమా పాటలు 
కాగా మిగతావి ఆల్బమ్స్ . తెలుగులో కన్నా తమిళ ,మలయాళ పాటలే ఎక్కువగా పాడారు.
కన్నడంలో పి.బి.శ్రీనివాస్ తో ఎక్కువ పాటలు పాడారు.
    కన్నడంలో "హేమవతి"చిత్రానికి యల్ .వైద్యనాధన్ గారి సంగీతంలో  అభేరి,తోడి రాగాల
 సమ్మేళనంగా ఒక లైన్ అభేరి ఒక లైన్ తోడి రాగాలతో "శివ శివ యన్నద నాళిగ  ఏకే "అనే 
ఒక పాట పాడటం జరిగింది .   ముత్యాల పల్లకిలో  బాల మురళి కృష్ణ గారితో 5 రాగాలతోను, బిస్మిల్లా 
ఖాన్  షేహానాయితోను, నామగిరి పేటై క్రిష్టన్ నాద స్వరం తోనూ,హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్
 తోనూ  తెలుగు ,మలయాళం లోను పాటలు పాడారు.మొదటి పాట పెండ్యాల గారి సారద్యంలో 
ఘంటసాల గారితో పాడగా ఘంటసాల  గారు   పెండ్యాల గారి సారద్యంలో జానకితో "నాన్న అనే
 రెండు అక్షరాలూ " గారు తన  చివరి పాట పాడారు . ఈ పాటపాడి ఘంటసాల గారు భోరున 
ఏడ్చారుట. నా తర్వాత నా పిల్లలు ఈ పాట పాడుకుంటారు అన్నారుట .
      " పువ్వులు పూయును పదివేలు"  "గున్న మామిడి కొమ్మమీద "  "మనసాతుళ్ళి పడకే "
"కలల అలలపై " "మేఘమా దేహమా " "ఈ దుర్యోధన దుశాసన " 'సిరిమల్లె పూవా " పాటలంటే 
ఇష్టం . పి.లీల,మహమ్మద్ రఫీ పాటలంటే ఇష్టం .ఎ .పి .కోమల పాడిన "పదములే చాలు రామా "
"రతిసుఖ సారే"పాట లంటే ఇష్టం .ఒకసారి మద్రాసులో ఒక పంక్షన్ లో పాడుతుండగా  అక్కడి 
పిల్లలు బోర్ ఫీల్అవుతుంటే వారికోసం చిన్న పిల్ల లాగా పాడింది . అక్కడే ఉన్న ఒక తమిళ్ 
నిర్మాత తన సినిమాలో ఆమెతో చిన్న పిల్ల లాగా పాడించుకున్నాడు.ఆ తర్వాత చాలా పాడింది.
"చందమామ రావే"  "జడ్జిమెంట్ " సినిమాలలో బేబి సుజితకు డబ్బింగ్ చెప్పింది. 
"మౌన పోరాటం " చిత్రానికి సంగీత దర్సకత్వం వహించింది .
త్యాగరాజ కీర్తనలు,సూరదాసు,కబీర్ దాసు,మీరా భజనలు, కృష్ణ రవళి, నాద ప్రవాహం ,పి.బి.శ్రీనివాస్ 
తెలుగు భక్తీ గీతాలు ,అయ్యప్పగితికాష్టకం ,శ్రీ వెంకయార్య సుప్రభాతం ,శ్రీ షిర్డీ గితమాలిక మొదలగు 
వాటికి సంగీతం సమకూర్చారు .అసలు చదువే లేని జానకి పాటలు కుడా వ్రాసారు. తమిళంలో 
"కన్నా నీ ఎంగె "పాట రాసి పాడారు.దానినే తెలుగులో "కృష్ణా నీ వెక్కడా "అంటూ అనువాదం చేసి 
 ప్రియా పచ్చళ్ళ కు అడ్వర్ టైజ్ మెంట్  పాటగా పాడారు.
            4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు ,తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలలో 
ఉత్తమ నేపద్యగాయనిగా ఎన్నుకోబడ్డారు . ఆమె ఎంత ఎత్తు ఎదిగినా భర్త చాటు భార్యే .రాంప్రసాదుతో 
ప్రేమ వివాహం . పారితోషికాలు ,రాయల్టిలు,డబ్బు వ్యవహారాలు అన్ని రాం ప్రసాదు గారే చూసుకునేవారు .
అత్తగారు ,మామగారు ,భర్త ఇచ్చిన ప్రోత్సాహంతోనే కెరీర్ కు ఇబ్బంది లేకుండా గడిచి పోయింది .
          ఆమెకు ఒక కొడుకు మురళి కృష్ణా.కోడలు ఉమా .మురళి కృష్ణ కొన్ని సినిమాలలో నటించాడు .
కోడలు డాన్సర్ .    రాంప్రసాద్ గారికి మొదటిసారి  గుండె నొప్పి వచినప్పుడు  హాస్పటల్ లో జాయిన్
చేసిన రోజున జానకి గారికి రికార్డింగ్స్ ఉన్నాయిట.తప్పని సరి పరిస్తితిలో  కార్తిక్ దీపం చిత్రం కోసం
 " నీచేతులలో తలవాల్చి"పాటను ఆయనను తలచుకుంటూ పాడారు.కాని  విదివైపరీత్యం ఆయనే
 ముందు చని పోయారు. ఆతర్వాత  ఆమె కొన్ని పాటలు పాడిన  క్రమంగా పాటలు తగ్గించారు.
ఈ మధ్యనే ఆమె పడిపోయి తలకు దెబ్బతగిలి చికిత్స చేయించుకొని కోలుకుంటున్నారు.వారు
కలకాలం చిరంజీవిగా జీవించాలని కోరుకుంటూ జానకిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.        























 మహనీయుని మధుర జ్ఞాపకాలు
   సేకరణ --పి.పద్మావతి శర్మ.ఎం.ఎ.(తెలుగు)
                 గాయని,రచయిత్రి,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
 11-2-12   నఅమర గాయకులూ  పద్మశ్రీ  శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు
 గారి వర్దంతి సందర్బముగా ఈ  వ్యాసం 64 కళలు.కం లో ప్రచురించబడింది.


నిర్మాతలు,నిర్మాణ సంస్దలు  బాగుంటేనే ఆర్టిస్టులు, టెక్నిషియన్లు
 బాగుంటారని ఘంటసాల గారు భావించేవారు.
అందుకే విజయవారు తీసిన షావుకారు  సినిమా విడుదలైన తర్వాత పుట్టిన
 తన పెద్ద కొడుక్కు విజయావారిగుర్తుగా విజయ కుమార్ అని పేరుపెట్టారు.
ఎక్కడ ప్రతిభ ఉన్నా గుర్తించేవారు ఘంటసాలవారు.ఒకసారి  విజయ నగరం
 వెళ్ళినప్పుడు రాత్రి పదకొండు గంటలప్పుడు తెలిసినవారితో వాకింగ్ చేస్తుండగా
 ఒక చెప్పులు కుట్టేవాడు తీస్తున్నకూనిరాగం విని ఆ ట్యునుని గుర్తు పెట్టుకుని
 చంద్రహారం  చిత్రంలో వాడుకున్నారుట.మరొకసారి  విజయ నగరం  వెళ్ళినప్పుడు
 ఆ చెప్పులు కుట్టేవాని వద్దకు వెళ్లి మంచి బహుమతి ఇచ్చారుట
1945  లో స్వర్గసీమ చిత్రం ద్వారా చిత్రరంగంలో ప్రవేశించినప్పుడు  మాస్టారు
1970  దాక చిత్రరంగాన్ని మకుటం లేని మహారాజుగా కాదుకాదు  మహాచక్రవర్తిగా
ఏలుతారనిఎవరు ఉహించి ఉండరు. పెద్దలు చెప్పిన మాటను వేదవాక్యంలా
స్వికరించేవారు ఘంటసాలవారు. మల్లాది రామకృష్ణశాస్తిగారువినయ  గుణ
 సంకలితమైనదే విద్య అన్నారుట ఒకసారి. శకుంతల అనే చిత్రాన్ని తీయాలని
 శంకరరెడ్డి గారు అనుకోని మల్లదిగారి చేత పాటలు రాయిస్తే దానికి సంగిత నడక
 కుదరలేదు. కవి వ్రాసింది  జనానికి నచ్చదు అనిచెప్పకుండా "అయ్యా మీరు
 రాసిన పాట నడక  నాతలకు ఎక్కడంలేదు" అన్నారుట.కవిగారు సన్నివేశం
 వివరించడంతో చక్కగా నడక సాగిందిట.కాని  అప్పటికే కొన్నివేల పాటలు పాడి
వందల సంఖ్యలో పాటలకు సంగీతం సమకూర్చిన  ఘంటసాలగారు తన వినయ
 సంపత్తితో అందరిని మెప్పించేవారు.
 ఘంటసాలగారికి  ఇడ్లి సాంబారు  అన్నా,లెమన్ డ్రింక్ అన్నా చాలా
 ఇష్టపడేవారు.,లెమన్ డ్రింక్ తాగితే గొంతు పట్టేస్తుందని ,లెమన్ డ్రింక్ తాగగానే
 చుట్ట వెలిగించేవారు. రికార్డింగ్ స్టూడియోకి రాగానే తానువచ్చినట్లు తెలియచేసి
 బయటకు వచ్చి చుట్టకాలుస్తూ కుర్చుని పిలవంగానే లోనికి వెళ్లి అద్బుతంగా
 పాటలు పాడేవారు .
మంచి చమత్కారులు  ఘంటసాలగారు. దేశద్రోహులు సినిమాలో "జగమేమారినది"
పాట రికార్డ్ అయ్యింది. కాని డబ్బులు ఇవ్వలేదు.చూచి  చూచి  ఘంటసాలగారు
అన్నారుట."స్వర రాజేశ్వరరావు గారికే పేమెంటు రాలేదు.ఇక మనలనెవడు చూస్తాడు.
ఇదినిజంగాదేశాద్రోహమే "అని
 ఘంటసాలగారు తన పెద్ద కొడుకుని మ్యూజిక్ డైరెక్టర్నుచేయాలని  తిరుపతిలో
మ్యూజిక్ కాలేజి పెట్టి తానూ చూచుకుంటూ రత్నకుమార్ ను తన వద్ద ఉంచుకోవాలని
 ఆశించారు .అందుకే రత్నకుమార్ ను  మ్యూజిక్ లైన్ లోకి తీసుక రాలేదు.తిరుపతిలో
స్ధలం  తీసుకున్నారు కాని ఆయన ఆశలు తిరకుండానే చనిపోయారు.

 ఘంటసాలగారు తన మొదటి పాట "స్వర్గ సీమ" చిత్రం
కోసం  పాడితే చివరిపాట "వస్తాడే మాబావ" చిత్రం కోసం పాడారు.

5, ఏప్రిల్ 2012, గురువారం











ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు (23 -3  -12 నుండి 31 -3 -12 వరకు )
వసంత నవరాత్రోత్సవముల సందర్భముగా కృష్ణజిల్లా గన్నవరంలో పి.పద్మావతి శర్మ
శ్రీ లలితా సహస్రనామ భాష్యం (అర్ధం ) ను ప్రవచనంగా చెప్పినప్పటి  చిత్రం.


















1 -4 -12  ఆదివారం  సా !! 6 గంటలకు శ్రీ ఘంటసాల సంగీత కళాశాలలో 
మహానటి సావిత్రి కళా పీఠం సంస్థవారు నిర్వహించిన "మరణంలేని మహానటి 
సావిత్రి "నటజీవితానికి 60 ఏళ్ళు కార్యక్రమంలో కళా సంస్థల వ్యవస్థాపకులకు
కళా సత్కారంలో పి.పద్మావతి శర్మకు (శ్రీ లలితా కళా స్రవంతి వ్యవస్థాపకురాలు )
 ఘన సన్మానం జరిగింది.ఆ సన్మానం చిత్రాలు చూడండి  

3, ఏప్రిల్ 2012, మంగళవారం

sukti sravanti

మహనీయుల సూక్తులు

పి .పద్మావతి శర్మ
[ఎం. ఎ. తెలుగు పండిట్ .రచయిత్రి, గాయని, సంగీతం,
 ఆద్యాత్మిక ప్రవచకురాలు.]
బలమే జీవనం , బలహినతయే మరణం.
వివేకానంద
ఎంతటి శత్రువునైన ప్రేమతో చూడాలి
గాంధీజీ
జీవునికి దేవునికి మధ్య తెర అహంకారం.
సత్య సాయి
మార్చలేని గతాన్ని గురించి మాట్లాడటం నిరుపయోగం
వ్యాసుడు
వంద చేతులతో సంపాదించు వెయ్యి చేతులతో దానంచెయ్యి
చాణిక్యుడు
దేశ భాషలందు తెలుగు లెస్స
కృష్ణదేవరాయలు
అన్ని జీవులలోవున్నా భగవంతుని ప్రేమించు
రామకృష్ణ పరమహంస
ఎవరిలోనూ తప్పులు వెతకవద్దు
శారదామాత

చీకటి వెనుక వచ్చే ఉదయంకోసం వేచి చూడు.
నేతాజీ
రచయిత కాదల్చుకున్నవాడు ముందుగా ఉత్తమ పాఠకుడు కావాలి
డ్రైదన్

kadha sravanti

గురుశిష్యులు

రచన : పి .పద్మావతి శర్మ


ఒక రాజ్యంలో ఒక గొప్ప గురువు ఉండే వాడు. అతని పేరు విద్యా నాధుడు.
  అతని వద్ద చాలా మంది శిష్యులు ఉండేవారు. విద్యా నాధుడు శిష్యులను
 ప్రేమతో చూస్తూ విద్య బుద్దులు నేర్పేవాడు. అప్పుడప్పుడు వారికి విద్యలోనే
 కాక వేరే విషయాలలో కుడా పరీక్షలు పెడుతుండే వాడు. ఆయన వద్ద
 అనంతుడనే శిష్యుడు విద్య నేర్చుకునేవాడు.
ఒకసారి అనంతుడు గురువుగారు ఏది అడిగిన ఇస్తాను అని తోటి
విద్యార్దులతో గొప్పలు చెప్పాడు. ఆవిషయం గురువు గారికి తెలిసింది.
  అవి నేరేడు పండ్లు కాసే రోజులు కావు. కాని అనంతుని పరీక్షించ డానికి
 గురువు గారు అనంతుని నేరేడు పండ్లు తీసుక రమ్మని చెప్పాడు.
అందరు ఆశ్చర్యంతో అనంతుడు ఏమి చేస్తాడా అని చూడ సాగారు.
  అనంతునికి గూడా ఏమి చెయ్యాలో తోచలేదు. గురువు గారు ఏది
 అడిగిన ఇస్తానని తోటివారితోచెప్పాడు. ఇప్పుడు గురువు గారుఅడిగిన
 పండ్లు దొరికేరోజులు కావు. ఎలానా అని అనుకుంటుండగా అతనికి ఒక
ఉపాయం తోచింది. గురువుగారి దగ్గరకు వెళ్లి “గురువుగారు నేను పండ్ల
 కోసం వెళుతున్నాను. నేను వచ్చేదాకా మీరు ఇక్కడినుండి కదలవద్దు.”
  అనిచెప్పి వెళ్ళాడు.
అతడు కాసేపట్లోవచ్చి పండ్లుదొరకలేదని చెపుతాడని అప్పుడు గొప్పలు
 చెప్పవద్దని బుధ్ది చెప్పాలనుకున్నాడు గురువుగారు. అనంతుని కిచ్చిన
 మాట ప్రకారం గురువు గారు కదలకకూర్చున్నాడు. ఒకరోజు గడిచింది.
  రెండు రోజులు మూడు రోజులు గడిచాయి. అనంతుడు రాలేదు. కాని ఒక
 మనిషి వచ్చాడు. అతడు గురువు గారితో “అయ్యా మీకాడ
 సదువుకొనేపిల్లడంట. అడవిలో తిరుగుతొండు. నేరేడు పండ్లుకావాలంట.
  ఇప్పుడు దొరకవు సామి అంటే ఇంటలేదు. మిమ్ము మాత్రం పండ్లు తెచ్చే
 దాకా ఈడనే కుసోమన్నాడు.” అని చెప్పాడు.
గురువు గారికి మిగతా శిష్యులకు గుండెల్లో రాయి పడ్డట్లయింది. అనంతుడు
 రానిదే గురువు గారు కదలటానికి లేదని తెలిసి శిష్యులందరు అనంతుని
 వెదకటానికి అడవికి వెళ్లారు. అనంతుడు కనిపించాడు కాని పండ్లు లేనిదే
 రానని చెప్పాడు. అప్పుడందరూ కలసి నచ్చచెప్పి గురువు దగ్గరకు తీసుక
 వచ్చారు. అనంతుడు వచ్చాడు కాబట్టి గురువు గారు కదలగలిగారు
. అనంతుడుకూడా గురువు గారి ఆశ్విర్వాదంతో చదువు కొనసాగించాడు.

నీతి: పిల్లలు గొప్పలు చెప్పకూడదు, పెద్దలు కుడా పిల్లలకు చెయ్యలేని
 పనులు చెప్పకూడదు.
[రచయిత: పి. పద్మావతి శర్మ. ఎం. ఎ. తెలుగు పండిట్ . రచయిత్రి
,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు]

kadha sravanti

అత్తగారి పెత్తనం 

రచన :- పి. పద్మావతి శర్మ . ఎం .ఎ .తెలుగు పండిట్ . రచయిత్రి ,
                                                  గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు .
రామవరం అనే గ్రామంలో కాంతమ్మ అనే ఆవిడా ఉండేది.ఆమె చాల
 గయ్యాళిది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.వాడి పేరు రంగడు.
 వాడంటే ఆమెకు చాలఇష్టం . కాని అడిగినవన్నీ ఇస్తే చెడిపోతాడని
 ఇచ్చేది కాదు.ఆ అలవాటు అందరి మీదకూడా చూపడం వచ్చింది .

కొన్ని రోజులకు అందరికి ఆవిషయం తెలిసి తమకు కావలసిన వాటిని
 ఆమెకు వ్యతిరేకంలో చెప్పి చేయించు కొనేవారు. ఆపై నవ్వుకునేవారు
. ఆవిషయం భర్త చెప్పిన వినిపించుకునేది కాదు . అలా జరుగుతుండగా
 రంగడికి పెళ్లీడు వచ్చింది. అదే గ్రామంలో విజయ అనే చక్కని పిల్ల ఉండేది.
ఆమె అంటే రంగడికి చాలా ఇష్టం.కాని ఆ విషయం తల్లికి తెలిస్తే విజయతో
 పెళ్లి జరగానీయదని, స్నేహితుల దగ్గర విజయతో తనకు పెళ్లి ఇష్టం లేదని
 చెప్పాడు. ఆ విషయం కాంతమ్మకు తెలిసింది. విజయ తల్లి తండ్రులతో
 మాట్లాడి రంగడికి విజయకు పెళ్లిచేసింది.
కొత్తకోడలిపై కూడా తన పెత్తనం సాగించేది.రంగడు తన తల్లి మంచిదేనని,
కాని ఆవిడకున్న అలవాటు సంగతి చెప్పి ఆమెను ఎప్పుడు బాధ పెట్టవద్దని
 చెప్పాడు. విజయ సరేనన్నది .కాంతమ్మ ఎదిచేబితే అదే చేసేది . అప్పటి
 నుండి విజయ తన ఇష్టా ఇష్టాలు అత్తకు తెలియనిచ్చేది కాదు. ఒకసారి
 విజయకు కాకర కాయ కూర తినాలనిపించింది. కాని అత్తకు తెలిస్తే
 తిననివ్వదని తెలిసి, అత్తా వినేటట్లుగా తనకు కాకర కాయ కూర అంటే
 అయిష్టమని ,పుట్టింట్లో కూడా కాకర కాయ కూర చేస్తే తినేదాన్నికాదని ,
అమ్మ అరిస్తే కాకర కాయ కూర వేయించుకుని తండ్రికో ,చెల్లెళ్ళకో
 వేసేదాన్నని రంగడితో చెప్పింది .
కాంతమ్మ కాకర కాయ కూర చేసి కోడలితో తినమని చెప్పింది. విజయ
తిననన్నది . తినాల్సిందేనని కాంతమ్మ పట్టు పట్టింది .రంగడు వచ్చాక
తింటానన్నదివిజయ. ఇప్పుడే తినాలని కాంతమ్మ పట్టు పట్టింది .
విజయ ఎడుస్తున్నట్లు నటిస్తూ కూర ఇష్టంగా తిన్నది. అలా తనకు
 కావలిన వాటిని సాధించుకునేది. కొద్ది సంవత్సరాల తర్వాత కాంతమ్మ
 జబ్బు చేసి చనిపోయంది అప్పటినుండి విజయ తనకు కావలసినవన్నీ
 తను చేసుకునేది