31, మే 2013, శుక్రవారం

నీకథామృతము నిరతసేవన నాకు




 నీకథామృతము నిరతసేవన నాకు

             రచన ------అన్నమాచార్య 
             
             రాగం-------బేగడ  

ప|| నీకథామృతము నిరతసేవన నాకు |
చేకొనుట సకల సంసేవనంబటుగాన |

చ|| ఇదియే మంత్రరాజము నాకు నే ప్రొద్దు |
ఇదియే వేద సంహిత పాఠము |
ఇదియె బహుశాస్త్ర మెల్ల చదువుటనాకు |
ఇదియె సంధ్య నాకిదియె జపమటుగాన ||

చ|| ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు |
ఇదియె దుఃఖవిరహిత మార్గము |
ఇదియె భవ రోగరహిత భేషజమునాకు |
ఇదియె ఉపనిషద్వ్యాక్య పద్ధతి ||

చ|| ఇదియె దాన ఫలమీ జాలినది నాకు |
ఇదియె తలప పరహిత మార్గము |
ఇదియె తిరువేంకటేశ నీసంస్మరణ- |
మిదియె ఇదియె యిన్నియును నటుగాన ||

30, మే 2013, గురువారం

కలశాపురముకాడ గంధపుమాకుల నీడ





 కలశాపురముకాడ గంధపుమాకుల నీడ

                  రచన ---అన్నమాచార్య

కలశాపురముకాడ గంధపుమాకుల నీడ
నలరేవు మేలు మేలు హనుమంతరాయ

సంజీవి కొండ తెచ్చి సౌమిత్రి బతికించి
భంజించితి వసురుల బలువిడిని
కంజాప్తకులరాఘవుని మెప్పించితివి
అంజనీతనయ వో హనుమంతరాయ

లంక సాధించితివి వీలావులెల్లా జూపితివి
కొంకక రాముని సీత( గూరిచితివి
లంకెల సుగ్రీవునికి లలి ప్రధానివైతివి
అంకెలెల్లా నీకు జెల్లె హనుమంతరాయ

అక్కజపుమహిమల హనుమంతరాయ                                      
దిక్కులు గెలిచితివి ధీరత( బూజ గొంటివి
మిక్కిలిప్రతాపాన మెరసితివి
ఇక్కువతో శ్రీవేంకటేశ్వరుబంట వైతివి




29, మే 2013, బుధవారం




అన్ని మంత్రములు ఇందె ఆవహించెను      
                         రచన----అన్నమాచార్య
                          రాగం ----అమృత వర్షిణి   
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను                                                                            
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము                                                                    
నారదుడు జపియించె నారాయణ మంత్రము –                                                        
 చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము

కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము


 వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము

రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె –                                                   


అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు

ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె –                                                    


వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి –                                                        

  పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను –                                                

వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము




చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి
                                        రచన --అన్నమాచార్య 

చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి      !!
చూడచిన్నదానవింతే !!
కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ 
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి        
 !!చూడచిన్నదానవింతే !!
సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి         
 !!చూడచిన్నదానవింతే !!
కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి     
 !!చూడచిన్నదానవింతే !!