
హింస
రచన :- పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
అంత్య దశలో నన్నొదిలి వెళ్లిందని కుమిలి పోయేకంటే
యవ్వనంలో నీవు పెట్టిన హింసలు
ఒక్కసారి గుర్తు తెచ్చుకో
నీకోసం పడిచచ్చే ఆడాళ్ళగురించి చెప్పి
ఎన్ని నిద్ర లేని రాత్రులు కల్పిచావో
నీ ఆనందానికి నీ తిరుగుళ్ళకు
తన ఆరోగ్యం ఎలా బలి పెట్టావో
అందరు అందమైన వాళ్ళుగా కన్పించి
ఆమె మాత్రమె కురుపిగా ఎందుకు కన్పించిందో
ఆమె తెలివి తేటలు ఎందుకు
పెరటి చెట్టు వైద్యం అయ్యయో
ఆమె అందం ఎందుకు
అడవికాచిన వెన్నెల అయిందో
ఒక్కసారి గుర్తు తెచ్చుకో
నాటి రోజుల ఫలితాలను
నేడు అనుభావిస్తున్నాని
సరిపెట్టుకో కుమిలిపో
క్రుంగిపో చచ్చిపో ----నిజంగా చచ్చిపో -----
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి