2, జూన్ 2010, బుధవారం

కవితా స్రవంతి

http://www.psychologytoday.com/files/u40/roy_lichtenstein_gallery_main.jpg

రంగుల వల

రచన :-పి .పద్మావతి శర్మ .ఎం . .తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .


ఆడదానికి ఆడది
అసలే శత్రువు కాదు
తండ్రి వలన తల్లికి
అన్నదమ్ముల వలన
వదినా మరదళ్ళకు
బావామరుదుల వలన
అక్క చెల్లెళ్ళకు
భర్త వలన
అత్తా ఆడపడుచులకు
బావ మరిదిగార్ల వలన
తన తోడికోడళ్ళకు
కొడుకుల వలన కోడళ్ళకు
శత్రువులు అవుతారేకాని
ఆడడానికి ఆడది
అసలే శత్రువుకాదు
మగవాడి వలన మాత్రమె
ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది
అది మంచిగాకాని చెడుగాకాని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి