6, డిసెంబర్ 2010, సోమవారం

వెంకటేశ్వర స్రవంతి


`





వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం పూలతో అలంకరిస్తూ ఉంటారు. పూలన్నీ టి.టి.డి. వారు పెంచే ఉద్యానవనాలనుంచి,ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి. ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం జరిగే తోమాల సేవలో స్వామివారికిపూలమాలలు అలంకరిస్తారు. ఋతువులను బట్టి పూలు మారతాయే కానీ అలంకరణలో మార్పు ఉండదు.స్వామివారిమూలమూర్తికి అలంకరించే స్థానాలను బట్టి పూలమాలలకు స్థిరమైన పేర్లు ఉన్నాయి. కిరీటం మీదినుంచి రెండుభుజముల పైకి అలంకరించే
ఎనిమిది మూరల పూల మాల "శిఖామణి".సాలగ్రామ మాలలనానుకొని
భుజముల నుండి పాదములవరకు వ్రేలాడే నాలుగుమూరల "సాలిగ్రామ పూలమాలలు ". మెడలో అలంకరించే రెండు వరుసలమూడున్నర మూరల పూల మాల "కంటా సరి ". శ్రీవారి వక్షస్థలంలో ఉండే శ్రీదేవీ,భుదేవిలకు ఒకటిన్నర మూరల దండలు " వక్షస్థలలక్ష్మి"పూలదండలు. ఒక్కో మూర
చొప్పున శంఖు,చక్రాలకు రెండు "శంకు ,చక్ర మాలలు". స్వామివారి బొడ్డువద్ద నుండే నందక
ఖడ్గానికి అలకరించే రెండు మూరల పూలమాల "కఠారి సరం ". మోచేతుల వద్దనుంచి
మోకాళ్ళ పైనుండి పదాల వరకుఉండే పూల దండలు "తావళములు". శ్రీవారి పాదాలకు వేసే
ఒక మూర పూల దండలు రెండు "తిరువడి దండలు ". ప్రతి గురువారం సాయంత్రం జరిగే "పూలంగి లో"లో స్వామి వారి ఆభరణములు తీసివేసి పూలనే అభరణములుగా
అలంకరిస్తారు ఇవి కాక ఆనందనిలయం లోని ఉత్సవమూర్తులకుదండలుతయారుచేస్తారు.భోగశ్రీనివాసమూర్తికిఒకదండ ,కొలువు శ్రీనివాస మూర్తికి ఒకదండ ,శ్రీదేవి,భుదేవి సహితమలయప్ప స్వామికి మూడు దండలు,శ్రీదేవి,భుదేవి సహితఉగ్ర శ్రీనివాస మూర్తికిమూడు దండలు, శ్రిసితారామ లక్ష్మణులకు మూడు దండలు.రుక్మిణి శ్రికృష్ణులకు రెండు దండలు,అనంత గరుడ విష్వక్సేనుల వారికీ మూడు దండలు, సుగ్రీవఅంగడహనుమంతులవారికి మూడు దండలుతయారుచేస్తారు.ఇవే కాక వరదరాజస్వామికి,వకుళ మాతకు, రామానుజుల స్వామి వారి మూల మూర్తికి, ఉత్సవ మూర్తికి,యోగ నరసింహ స్వామివారికి ,విష్వక్సేనులు,పోటు తయారుకు,గరుడాళ్వారు వారికీ ,చక్రత్తళ్వారు వారికీ, బేడి ఆంజనేయస్వామి వారికి ఒకొక్కదండ,బంగారు వాకిలి ద్వారపాలకులకు రెండు దండలు,వరాహ స్వామివారి ఆలయానికి మూడు దండలు ,ప్రతిఆదివారం కోనేటిగట్టు ఆంజనేయస్వామి వారికి ఒకదండ తయారు చేస్తారు. అంతా కాక నిత్య కళ్యాణం ,వసంతోత్సవం,ఊరేగింపులు ,ఉత్సవాలకు ప్రత్యెక దండలు తయారు చేస్తారు. తులసి,చామంతులు,గన్నేరులు,సన్నజాజులు,మల్లెలు,మొల్లలు,మొగలి,తామర,కలువ,
గులాబీలు,సంపెంగలు,మామిడాకులు, తమలపాకులు,కనకాంబరాలు,మరువం, మాచిపత్రం, దవనం, మారేడు దళం,పచ్చిపసుపు ఆకులూ మొదలగు రంగు రంగుల సుగంధ పరిమళ పుష్ప జాతులు,పత్రాలతోదండలు తయారు చేస్తారు.



























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి