4, డిసెంబర్ 2010, శనివారం

కవితా స్రవంతి



నన్ను చూచుకుని నేనే మురిసి పోతుంటాను.

నా మేని మెరుపు చూచుకుని నే ఆనందపడుతుంటాను.
అందుకే రాత్రంతా కునుకు తీయక విహారం చేస్తుంటాను.
అందరు నన్ను చిత్రంగా చూస్తుంటే సంతోష పడుతుంటాను.
ఒకసారి నాకు అనారోగ్యం చేసింది.
అరాత్రంత నిద్ర పోయి తెల్లవారి బయటకు వచ్చాను.
విచిత్రం. నన్నెవ్వరు పట్టించుకోవడం లేదు.
నాతో రోజు రాత్రి తిరిగే మిత్రుని అడిగాను.
ఇలా ఎందుకు జరుగుతోందని.అతడు చెప్పాడు .
రాత్రే నాకు విలువని, పగలు నన్నెవ్వరు చూడరని.
నేనొక మిణుగురు పురుగునని .
నా విలువ చీకటి రాత్రుల నందేనని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి