7, అక్టోబర్ 2012, ఆదివారం

అమ్మ

                                                     అమ్మ

రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .

అమ్మ నాకే మిచ్సిందని అనకు.
తన రక్తంలో రక్తం ఇచ్చింది.
తన బలంలో బలం ఇచ్చింది.
తన ఆహారంలో ఆహారం ఇచ్చింది.
నిన్ను తొమ్మిది నెలలు మోసింది

తన ప్రాణం ఫణంగా పెట్టి

నీకు జన్మ నిచ్చింది.

అమ్మ నాకేం చేసింది అనకు.
తన పాలతో నీ కడుపు నింపింది.
నీ ముక్కు తుడిచింది.
నువ్వు నవ్వితే నవ్వింది.
నువ్వు ఏడిస్తే ఏడ్చింది.
నీ మలముత్రాలు ఎత్తింది.
నిఇకు తొలి గురువయింది.
నీ పాలిటి దైవమయింది.
నీకు రోగమొస్తే నర్సు అయింది.
నీకు నిద్ర వస్తే లాలి పాట
అయింది.

రమ్య భారతి త్రైమాసిక పత్రికలో మే -జులై సంచికలో ప్రచురితమైన కవిత  

2 కామెంట్‌లు:

  1. మాటలు లేవండీ! చాలా సరళమయిన పదాలతో చక్కగా వ్రాశారు!ఇంకా వ్రాయవలసినది, అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా!

    రిప్లయితొలగించండి
  2. రసజ్ఞ అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది .ఆ కవిత మా అమ్మగారు చనిపోయినప్పుడు రాసింది .ఆసమయంలో అంతకన్నా రాయలేకపోయాను మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి