30, సెప్టెంబర్ 2012, ఆదివారం

వివిధదేశాల్లో వినాయకుడు



                                              వివిధదేశాల్లో వినాయకుడు
శ్రోతలకునమస్కారంరోజువివిధదేశాలోవినాయకుడువినాయకప్రత్యెక అంశాలు గురించి తెలుసుకుందాం .
                   ప్రాత: స్మరామి గణనాధ మనాద బందో
                   సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం
                   ఉద్దండ విఘ్న పరి ఖండన చండ దండం
                   అఖండలాది సుర నాయక బృంద వ్యంద్యం
ప్రమద గణాలకు అధిపతి, దీనులకు దిక్కైన వాడు, సింధూరముచేశోభిల్లు చెక్కిళ్ళు కలిగినవాడు,అడ్డంకులను తొలగించు వాడు ,ఇంద్రాది దేవతలచే స్తుతింప బడినవాడైన
గణపతిని ప్రాంత: కాలములో స్మరిస్తున్నాను .
సింధూరపు రంగు ,గరిక,శమి పత్రం ,జిల్లేడు పూలు , 
ఎర్ర చందనం ,ఎర్రని పుమాలలు వినాయకునికి ఇష్టమైనవి.కావున పూజకు కూడా సింధూరపు వర్ణమైన వినాయకుని తీసుకుంటే మంచిది .సింధూర వర్ణ మనగా కాషాయ వర్ణం .పూజా పత్రీ 21 రకములు అవి ఆరోగ్య సూత్రాలతో ముడిబడి ఉన్నాయి .పూజా పత్రీ 21 రకాలు .అవి ఆరోగ్య సూత్రాలతో ముడిపడి ఉన్నాయి విష్ణు మూర్తి రూపాలు 10 .శివ రూపాలు 11 .మొత్తం 21 ఇరవై ఒక్కరూపాలకు
  ఇరవై ఒక్క రకాల పత్రితో పూజిస్తాము .ఆరోగ్యరీత్యా భాద్రపద మాసంలో ఉడికించిన ఆహారం తినాలని సూచిస్తూ ఆవిరిపై ఉడికిన కుడుములను నైవేద్యం పెడతారు .చెరకు గడలు,కొబ్బరికాయలు,అరటి పండ్లులు ,లడ్లు,నువ్వులు వినాయకుడికి ఇష్టమైన ఆహారం .వినాయకునికి షోడశ నామాలు ఉన్నాయి   సుముఖ, స్కందపూర్వజ, ఏకదంత , హేరంభ , కపిల , శుర్పకర్ణ, గజకర్ణ , వక్రతుండ , లంబోదర, గజానన, వికట,ఫాలచంద్ర ,విఘ్నరాజ, గణాధ్యక్ష, గణాధిప,ధూమకేతు అను నవి షోడశ నామాలు .వినాయకుని ఆకారం వింతగా ఉంటుంది మనిషి శరీరం,ఏనుగు తల ,పెద్ద బొజ్జ ,ఎలుక వాహనం ,ఆకులతో పూజ .కాని ఇందులో ఎంతో అంతరార్ధం ఉంది
                                       శుక్లాంబరధరం విష్ణుం
                                       శశి వర్ణం  చతుర్భుజం
                                       ప్రసన్న వదనం ధ్యాయేత్
                                      సర్వ విఘ్నోపశాంతయే
ఈశ్లోకాని మామూలు ఆర్ధం ఏమిటంటే తెల్లని వస్త్రములు ధరించువాడు విష్ణు పేరు రూపముగా కలవాడు,చంద్రునిలా తెల్లగా ఉండేవాడు ,నాలుగు చేతులు కలిగినవాడు ,ప్రసన్నమైన ముఖం ఉన్నవాడు అయిన వినాయకుని ప్రార్ధిస్తున్నానని .లోపలి అర్ధం ఏమిటంటే చాలా మంది  శ్లోకం వినాయకుదిడా విష్ణువుదా అనుకుంటారు. విష్ణువు తెల్లని వస్త్రములు ధరించాడు .పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు.చంద్రునిలా తెల్లగా శ్రీహరి ఉంటాడా ?ఉండదు ఎందుకంటే నీలమేఘ శ్యాముడు విఘ్నాలను   తొలగిస్తాడా అంటె ఆయన విఘ్నపతి కాదు.ఇక వినాయకుడిదా అంటె వినాయకుడు ఎర్రని వస్త్రములు ధరిస్తాడు ఇష్ట పడతాడు .చంద్రునిలాంటి శరీర ఛాయా కలిగిన వాడా అంటె కాదు సింధూర వర్ణం కలిగినవాడు .మరి ఎవరు ?మరి శ్లోకం ఎవరికీ చెందినది అంటె పృథ్వి ఆకాశం మొదలగు పంచ భూతాలమీద అడుపుకలిగిఆకాశాన్నే ధరించువాడు కుందేలును శశి అంటారు కుందేలు రూపాన్ని తనలో  కలిగినవాడుచంద్రుడు.ఆచంద్రుడిన ధరించినవాడు ,రోజులు పక్షాలు నెలలు ,సంవత్సరములు భుజములుగా కలిగిన వాడు ,కోపం లేని ప్రసన్నంగా అభయ మిచ్చేటట్లుఉండే ముఖం  కలిగినవాడు ఇంతకూ దైవం ఎవరు ?వినాయకుడా ?విష్ణు ముర్తా ? వినాయకుడు విష్ణు మూర్తి ఒక్కరే ఇద్దరు కాల స్వరుపులే .కాలానికే కష్టాలు .చంద్రుడు 15 రోజులు వన్నె పెరిగి 15 రోజులు వన్నె తరిగినట్లుగా కాలానికి కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు .కష్టాలు వచ్చినప్పుడు తొలగించమని కాల స్వరుపులైన విష్ణు రూపంలో ఉన్నా వినాయకుని ,వినాయక రూపంలో ఉన్నా విష్ణువుని  ధ్యానిస్తున్నమన్న  మాట. విధి శూల ఇండ్లకు  వినాయకుని అమర్చి యింటికి రక్షణ ఇయ్యమని కోరుకుంటాం అసలు వినాయక రూపంలో జ్యోతిష్యం . వినాయకుడు హస్తి ముఖుడు .హస్తి అంటె తొండం.తొండం ముఖం కలిగిన వాడు వినాయకుడు  అసలు లోపలి అర్ధం ఏమిటంటే  వినాయకుని జన్మ నక్షేత్రం హస్త .కన్యా రాశి. హస్త,కన్యా రాశులకు అధిపతి బుధుడు .బుదుదంటే పండితుడు .అందుకే కోరిన విద్య లకెల్ల ఒజ్జవై  అంటూ ప్రస్తుతిస్తాం. విద్యనైన ప్రసాదించ గలిగినవాడు వినాయకుడు . బుధుడు ఆకుపచ్చ రంగులో ఉంటాడు. వినాయకునికి ఆకులంటే చాలా ఇష్టం . కారణంగా వినాయకుడు  జన్మ నక్షేత్రమైన హస్తా కన్యా రాశు లలో ఉన్నవాడై ఉన్నాడు. వినాయక చవితి నాడు ఇంకో విశేష మేమిటంటే ఆకాశంలో ఒక వింత జరుగుతూ ఉంటుంది.వినాయక చవితి నాడురాత్రి ఆకాశాన్ని చూస్తే వినాయక రూపం కనిపిస్తుంది మరి ఆరోజు ఆకాశం చూడవచ్చా? చూడవచ్చు .ఎందుకంటేమనం కధ చదువు కుంటాం కదా !సూర్యుడు సింహ రాశి చివరలో ఉండగా వచ్చేదే భాద్రపద మాసం.ఆకాశంలో చేతి ఐదు వేళ్ళలాగానక్షత్రాలుకనిపిస్తాయిఅదేహస్తానక్షత్రం.దేవినాయకునిజన్మనక్షేత్రం.ఈశాన్యంనుండి  నైరుతికి వరుస నక్షేత్రాలు కనిపిస్తాయి ఈశాన్యం వైపు పాము ఆకారం కనిపిస్తుందిఅదే వినాయకుని నాగ యజ్ఞోపవితం అన్నారు .కొన్ని నక్షేత్రాలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి దాన్ని వినాయకుని బొడ్డు  అంటారు.ఇవి తప్ప ఆకాశంలో ఏనక్సేత్రం కనిపించక పోవడాన్ వల్ల వినాయకుని బొజ్జ అన్నారు .ఈబొజ్జకు కొద్ది దూరంలో నల్లని నీడ ఆకారంలో ప్రకాశవంతంగాలేని ఆకాశం కనిపిస్తుంది .దాన్ని ఎలుక వాహనం అన్నారు.వినాయకుని బొజ్జకు దగ్గరగానే వాహనం ఉండటం వలన ఆయన కాళ్ళు పోట్టివని మరుగుజ్జు అని అన్నారు ఇదంతా నిజమని నిరుపించేది కన్యారాశిలో హస్తా నక్షేత్రంలో చంద్రుడు ఉదయించడం. ఇక ఓం కారం పూజైనా ఓంకారంతోనే ప్రారంభిస్తాం .ఓంకారాన్నిగీస్తాం.ఓంగీసేటప్పుడు మూడు అంకె వేసి ఎడమవైపుకు ఒక వంక గీసి ఆవంకపై అర్ధచంద్రాకారం గీస్తాం . మూడు అంకెను పై చిన్నగా ఉండే భాగాన్ని వినాయకుని తల అని పెద్ద భాగాన్ని బొజ్జ అని చిన్న వంక తొండం అని అర్ధచంద్రాకరం  ఆయన ధరించిన నెలవంక అని పెద్దలు చెబుతారు .కాబట్టిభావంతపూజామందిరంలో ఓంనిగీస్తే వినాయకుని ఆహ్వానిచినట్లే ,పూజించి నట్లే . అలాగే వేదాలను త్రయి అంటారు . వాటినుంచి వచ్చిదే + +మ్ = మూడింటిని కలిపితే ఓం అంటారు .
ఇక వివిధ దేశాలలో వివిధ ప్రాంతాలలో వినాయకుడ్ని వివిధ పేర్లతో పిలుస్తారు   కాశ్మీర్ లోచాలా చోట్ల స్వయంభూవిగ్రహాలేఉన్నాయి  .లిడార్ నదీ ఒడ్డున  గణేష్ బాలలోగణేష్ విగ్రహంఉంది .వేలాది మంది దర్శనంచేసు కుంటారుహరిపర్వతం మీద  భీమ శంకరుడిగా ,కిషన్ గంగా నదీ ఒడ్డున గణేష్ గతిగావినాయకుడు  పిలువబడతాడు. తిరుచురాపల్లి లో చాలా ఎత్తైన కొండ మీదఉచ్చియార్పిళ్ళైయార్ అను పేరుతొగణపతిఆలయం ఉంది మదురైలో,  టిబెట్లో ,బెరాఘాట్లో స్ర్తీ మూర్తిగాదర్శనమిస్తారుగణపతి  .శ్రీ లంకలో యోగినిగా,గుజ్జు రూపంలో చాలా ప్రదేశాలలో  ఉంటాడుగణపతి.పోలోన్నరూపఅనేప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నా గణపతి చాలా అందంగా ఉంటాడు శ్రీలంకలో తమిళులు పిళ్ళైయార్ అనిపిలుస్తారు. మదురైలో గణేష్ విగ్రహం స్త్రీ రూపంలో పులి పాదాలతోవ్యాఘ్ర పాద వినాయకునిగా  పూజలందుకొంటున్నాడు.టిబెట్లో గజానని అను పేరుతో  పూజ లందు కొంటున్నాడు   టిబెట్లో బోగ్స్ డ్యాగ్అని కూడా పిలుస్తారు. నేపాల్ లోవినాయకుడిని ఎక్కువగా పూజిస్తారు నేపాల్ లోని  ఆలయాలలో  
 ద్వారాలపై గణపతి ఉంది  దుష్ట  శక్తులను తరిమేస్తాడనవారి నమ్మకం.ఖోటాన్ లో లోహంతోను కర్రతోను విగ్రహాలు తయారుచేస్తారు నిక్కర్ తోడుగుకున్నట్లు కూర్చున్నప్పుడు మడమలు తాకుతున్నట్లు ఉంటాయి పులి చర్మాన్ని ధరిచి చేతులలో మోదక పాత్ర,అంకుశం ,మూల కందం,పరశువులు ఉంటాయి .  గుహాలలో ఆరు చేతులతో సూర్య చంద్రులను చేతులలో పట్టుకున్నట్లుగా   ఉంటాయి  ఖోటాస్ కి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్నా ఖక్లిక్ లో మూడు చేతులు ఉన్నా వినాయక చిత్రాలు పంచె కట్టుకుని,ఉతరియాలు ధరించి ఉంటాయి .మంగోలియాలో నోటియండు చింతామణి ఉన్నా ఎలుకపై నృత్యం చేస్తున్న విగ్రహాలు ఉంటాయి గణపతిచేతులలో అంకుశం బదులు త్రిశూలం  ఉంటాయి   ఆప్ఘనిస్తాన్ దేశంలో కాబులుకు  దగ్గరలో గార్దేజ్లో ఆరవశాతాబ్దానికి చెందినా వినాయక విగ్రహం ఉంది కాబూల్కు పది కిలో మీటర్ల  దూరంలో  సకర్ ధరలో నిలబడిన గణేష్ మూర్తి ఉంది నాలుగు చేతులు ఉంటాయి .చైనాలో బుద్దుని రూపానహోటిగాపూజలందు కుంటున్నాడు చైనాలోనీ ఒక  విగ్రహాన్ని క్రిశ 531 నాటిదని చెబుతారు .అది పద్మాసన  స్థితీలో ఉంది ..     పాగాన్ లో నాలుగు చేతులతో పరశువు, అక్షరమాల,శంఖం, మాదిఫలం ఉంటాయి.కాళ్ళదగ్గర తాబేలు,చేప,మొసలి బొమ్మలు  ఉన్నాయిబ్యాంకాక్ లో ఒక ఆలయంలో వినాయకుని కంచు విగ్రహముంది. వ్యాసుడు భారతం చెబుతుంటే గణపతి రాస్తున్నట్లు ఉంటుందినాటి  మన కాంభోజ రాజ్యమే నేటి కంబోడియా ఇక్కడ నాలుగు తలలతో రెండు  చేతులతో వినాయకుడు వేంచేసి ఉంటాడు.ఇక్కడ గణపతి ఆలయాలు ప్రత్యేకంగా ఉంటాయి  కంబోడియాలో ప్రాకెనేస్ అని పిలుస్తారు   మంగోలియాలో తోత్కరూర్ ఖగన్ అని ,జపాన్ లోకూడాజంట గణపతి విగ్రహాలు  ఉన్నాయి వాటిని  కాంగితెన్ అని పిలిచే వారు కాంగితెన్ అంటె సుఖాని సమృద్ధిగా ఇచ్చి ఆరోగ్యం ప్రసాదించే దేవుడి  సోదేన్ అంటె  ఆర్య దేవుడని వినాయక్స్అంటె భోగ్య భాగ్యాలు ఇచ్చి శృగారం కలిగించే దేవునిగా కొలుస్తారు అక్కడ వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు ఉన్నాయి  ఒక విగ్రహం లడ్డు,అంకుశం,పాశం,ఖడ్గం ,పరుశులు,గద,వజ్రం ధరించి నట్లు,మరొక విగ్రహం మూడు ముఖాలను కలిగి నాలుగు చేతులు కలిగి నాలుగు చేతులలో రెండు చేతులతో నమస్కారం చేస్తూ మిగిలినరెండు చేతులలో మోదకం అంకుశం కలిగినట్లు మరొక విగ్రహం పరశువులు అంకుశం ధరించినట్లు ఉన్నాయి మరొక విగ్రహం ఇద్దరు వినాయకులు కౌగిలించినట్లుగా     ఉన్నాయి     మామూలు విగ్రహాలనుఅక్కడ  శోదేన్  వినాయక్స్ అని పిలిచేవారు   ఈజిప్ట్ లో బేస్ అని రోమన్లు జానుస్ అని పిలుస్త్తారు .రోమన్లు మనంకుడుములుచేసినట్లే  కేక్స్ తయారుచేస్తారు  మలేషియా,బాలి ,బోర్నియా ,సియాం,చైనా ,మధ్య ఆసియా వెస్టిండీస్ హవాయి మారిషస్ దేశాలలో వినాయకుడినిపుజిస్తారు హవాయిలో ఆరు అడుగుల వినాయకవిగ్రహం తవ్వకాలలో బయట పడింది. ఫిజి స్కాట్ ల్యాండ్అమెరికా స్విజర్లాండ్ జర్మని డెన్మార్క్ దేశాలలోవినాయక మందిరాలు  ఉన్నాయి.ఇంకా విచిత్రమైన ఏమిటంటే మన  ఆంద్ర ప్రదేశ్ లో విశాఖ జిల్లాలోని చోడవరంలో ఏటేటా ఎత్తు బరువు పెరుగుతున్న గణపతి ఉన్నాడు .అది మనకు ఎలా తెలుస్తున్నది అంటె ఇంతకూ ముందు చేయించిన కిరీటం ఇప్పుడు పట్టటం లేదుట.మరి ఇది మనం నమ్మ వలసిందే కదా    వినాయక పూజ పిల్లలకుచాలా మేలు చేస్తుంది  జ్ఞాపక శక్తిపెంచుతుంది  మేధస్సు పెరుగుతుంది వ్యక్తిత్వంపెరుగుతుంది విద్యార్జన బాగుంటుందిసమయ పాలనా జరుగుతుంది చేసే పనులపై అదుపు ఉంటుంది జీవితంలో విజయం సాధిస్తారు పని చేసినా విజయంకలుగుతుంది కావున విద్యార్ధులు ప్రతి రోజువినాయకుని ప్రార్ధించాలి .విద్యార్ధులే కాదు మనమందరం కూడా వినాయకుని ప్రార్ధిచి ఆయన ప్రసన్నతను తీసుకుంటే మనకు ఎపనిలోను జయం కలుగుతుంది
                                                             
                                                      -------నమస్తే ----
(18 -9-2012 న  ఆకాశవాణి  విజయవాడ కేంద్రంలో వినాయక చవితి  సందర్భముగా నేను ఇచ్చిన ప్రసంగం )































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































1 కామెంట్‌:

  1. పద్మావతి గారు..ఎలా ఉన్నారు!? మనుమరాలి ఫోటో.. చూసాను.

    కుమారుడిని చూపించారు. చాలా సంతోషం. వారికి నా హృదయపూర్వక దీవెనలు.

    రిప్లయితొలగించండి