27, అక్టోబర్ 2012, శనివారం

శిబిచక్రవర్తి

శిబిచక్రవర్తి
ఒక రాజ్యానికి ఉశినరుడు అను రాజు ఉండేవాడు.అతని కుమారుడు శిబిచక్రవర్తి. .తండ్రి తరువాత శిబి రాజ్యానికి రాజు అయ్యాడు. శిబిచక్రవర్తి మహాదాత .ఎవరు ఏది అడిగిన కాదనేవాడుకాడు ఒకసారి శిబిచక్రవర్తి సభలో కూర్చుని ఉండగా ఒకపావురాన్ని ఒక డేగ తరుముకుంటూ వచ్చింది పావురం భయంతో వణికిపోతూ శిబిచక్రవర్తి.చెంతకు వచ్చి వాలింది అప్పుడు రాజ పురోహితుడు రాజుతో "రాజా ఈ పావురం మీ శరణు కోరుతున్నది "అన్నాడు అప్పుడు పావురం మనుష్య భాషలో "రాజా !నేనొక ఋషిని బ్రహ్మచర్య దీక్షతో పాప రహితుదనై వేదాధ్యయని చేసి యోగ శక్తులు పొంది నవాడను పక్షి రూపము ధరించి ఉండగా ఈ డేగ నావెంట పడినది నివు నా ప్రాణాలు కాపాడ తావని నీ శరణు వేడుకుంటున్నాను నన్ను రక్షించు " అన్నది అప్పుడు ఆ డేగ "ఓ రాజా !పావురం నా ఆహారం చాలాదూరం నుండి తరుము కుంటూ వచ్చాను నానోటిదగ్గరి ఆహారాన్ని నాకు దూరం చేయకు "అన్నది మానవ భాషలో పక్షులు మాట్లాడటం శిబిచక్రవర్తి. ఆశ్చర్యం కలిగించింది అసలప్పుడు ఆయనకు విషమ పరిస్థితి ఏర్పడింది శరణార్ధికి అభయమివ్వకపోతేరాజ్యం సుభిక్షితం గా ఉండదు సమయానికి వర్షాలు పడక క్షామం వస్తుంది దేవతలకు కోపం వస్తుంది అని తలచి "ఓ డేగరాజా !ఈ పావురం చాలా చిన్నది నీకు ఆహారం గా చాలదు దీని కంటే బలమైన ఆహారాన్ని నా సేవకులచే నీకు వండించి పెడతాను నీకు మంచి వసతిని కూడా ఏర్పాటు చేస్తాను"అన్నాడుఅప్పుడు
 డేగ "రాజా నివు ఇచ్చే ఆహారం నాకు అక్కరలేదు నాకు పావురం కంటే రుచికరమైన ఆహారం లేదు ఆ పావురంనాది
దానిని నాకు విదిచిపేటు "అన్నది శిబిచక్రవర్తి డేగను అనునయిస్తూ "పావురం కాకుండా ఏదైనా అడుగు ఇస్తాను శరణు కోరినవారిని రక్షించడం రాజు ధర్మం నాధర్మాన్ని నన్ను పాలించనివ్వు"అప్పడుడేగ"ఓరాజపావురంబరువుకు
సమానంగా మాంసం నీ కుడి తోడనుండి కోసిఇవ్వు అప్పుడు నీ ధర్మం నెరవేరుతుంది నా ఆకలి తీరుతుంది "అంది అందుకు శిబిచక్రవర్తి సంతోషంగా ఒప్పుకున్నాడు వెంటనే ఒక త్రాసు తెప్పించి ఒక వైపు పావురమును ఉంచి రెండవ వైపు తన కుడి తోడను కోసి మాంసము వేయసాగాడు ఎంత మాంసము వేసినా పావురమే బరువు తూగు చున్నది క్రమంగా తన అవయవములన్ని కోసి వేయసాగాడు అయినా పావురమే బరువుగా తూగసాగింది చివరికి తానె  త్రాసులో కూర్చున్నాడు డేగ పావురానికి ప్రాణరక్షణ జరిగింది అంటూ తుర్రున ఎగిరిపోయింది అప్పుడు శిబిచక్రవర్తి పావురాన్ని చూచి "అయ్యా మీరెవరో మహాత్ములు మీరు మామూలు పక్షికాదు మీరెవరో నాకు తెలియ పరచి నన్ను అనుగ్రహించండి" అని ప్రాధేయ పడగా ఆ పావురం తన నిజ స్వరూపమైన అగ్ని దేవునిగా ప్రత్యేక్షమై "ఓ శిబిచక్రవర్తి నేను అగ్ని దేవుడను డేగ ఇంద్రుడు మానవులలో గొప్పవాడివైన నిన్ను పరీక్షించుటకై ఈ వేషములలో వచ్చాము నీ గొప్పతనమును నీ త్యాగబుద్ధిని ప్రపంచమునకు చాటుటకై వచ్చాము "అని చెప్పి ఆశ్వీరాదించి వెళ్లి పోయాడు తన త్యాగ బుద్ధితో శిబిచక్రవర్తి కీర్తి కాయుడయ్యాడుస్వర్గంలో శాశ్విత స్థానం పొందాడు
 
భావ తరంగిణి  మాస పత్రిక అక్టోబర్ 12లో ప్రచురించబడినది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి