మహనీయుని మధుర జ్ఞాపకాలు
సేకరణ --పి.పద్మావతి శర్మ.ఎం.ఎ.(తెలుగు)
గాయని,రచయిత్రి,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
11-2-12 నఅమర గాయకులూ పద్మశ్రీ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు
గారి వర్దంతి సందర్బముగా ఈ వ్యాసం 64 కళలు.కం లో ప్రచురించబడింది.
నిర్మాతలు,నిర్మాణ సంస్దలు బాగుంటేనే ఆర్టిస్టులు, టెక్నిషియన్లు
బాగుంటారని ఘంటసాల గారు భావించేవారు.
అందుకే విజయవారు తీసిన షావుకారు సినిమా విడుదలైన తర్వాత పుట్టిన
తన పెద్ద కొడుక్కు విజయావారిగుర్తుగా విజయ కుమార్ అని పేరుపెట్టారు.
ఎక్కడ ప్రతిభ ఉన్నా గుర్తించేవారు ఘంటసాలవారు.ఒకసారి విజయ నగరం
వెళ్ళినప్పుడు రాత్రి పదకొండు గంటలప్పుడు తెలిసినవారితో వాకింగ్ చేస్తుండగా
ఒక చెప్పులు కుట్టేవాడు తీస్తున్నకూనిరాగం విని ఆ ట్యునుని గుర్తు పెట్టుకుని
చంద్రహారం చిత్రంలో వాడుకున్నారుట.మరొకసారి విజయ నగరం వెళ్ళినప్పుడు
ఆ చెప్పులు కుట్టేవాని వద్దకు వెళ్లి మంచి బహుమతి ఇచ్చారుట
1945 లో స్వర్గసీమ చిత్రం ద్వారా చిత్రరంగంలో ప్రవేశించినప్పుడు మాస్టారుచంద్రహారం చిత్రంలో వాడుకున్నారుట.మరొకసారి విజయ నగరం వెళ్ళినప్పుడు
ఆ చెప్పులు కుట్టేవాని వద్దకు వెళ్లి మంచి బహుమతి ఇచ్చారుట
1970 దాక చిత్రరంగాన్ని మకుటం లేని మహారాజుగా కాదుకాదు మహాచక్రవర్తిగా
ఏలుతారనిఎవరు ఉహించి ఉండరు. పెద్దలు చెప్పిన మాటను వేదవాక్యంలా
స్వికరించేవారు ఘంటసాలవారు. మల్లాది రామకృష్ణశాస్తిగారువినయ గుణ
సంకలితమైనదే విద్య అన్నారుట ఒకసారి. శకుంతల అనే చిత్రాన్ని తీయాలని
శంకరరెడ్డి గారు అనుకోని మల్లదిగారి చేత పాటలు రాయిస్తే దానికి సంగిత నడక
కుదరలేదు. కవి వ్రాసింది జనానికి నచ్చదు అనిచెప్పకుండా "అయ్యా మీరు
రాసిన పాట నడక నాతలకు ఎక్కడంలేదు" అన్నారుట.కవిగారు సన్నివేశం
వివరించడంతో చక్కగా నడక సాగిందిట.కాని అప్పటికే కొన్నివేల పాటలు పాడి
వందల సంఖ్యలో పాటలకు సంగీతం సమకూర్చిన ఘంటసాలగారు తన వినయ
సంపత్తితో అందరిని మెప్పించేవారు.
ఘంటసాలగారికి ఇడ్లి సాంబారు అన్నా,లెమన్ డ్రింక్ అన్నా చాలా
ఇష్టపడేవారు.,లెమన్ డ్రింక్ తాగితే గొంతు పట్టేస్తుందని ,లెమన్ డ్రింక్ తాగగానే
చుట్ట వెలిగించేవారు. రికార్డింగ్ స్టూడియోకి రాగానే తానువచ్చినట్లు తెలియచేసి
బయటకు వచ్చి చుట్టకాలుస్తూ కుర్చుని పిలవంగానే లోనికి వెళ్లి అద్బుతంగా
పాటలు పాడేవారు .
మంచి చమత్కారులు ఘంటసాలగారు. దేశద్రోహులు సినిమాలో "జగమేమారినది"
పాట రికార్డ్ అయ్యింది. కాని డబ్బులు ఇవ్వలేదు.చూచి చూచి ఘంటసాలగారు
అన్నారుట."స్వర రాజేశ్వరరావు గారికే పేమెంటు రాలేదు.ఇక మనలనెవడు చూస్తాడు.
ఇదినిజంగాదేశాద్రోహమే "అని
ఘంటసాలగారు తన పెద్ద కొడుకుని మ్యూజిక్ డైరెక్టర్నుచేయాలని తిరుపతిలో
మ్యూజిక్ కాలేజి పెట్టి తానూ చూచుకుంటూ రత్నకుమార్ ను తన వద్ద ఉంచుకోవాలని
ఆశించారు .అందుకే రత్నకుమార్ ను మ్యూజిక్ లైన్ లోకి తీసుక రాలేదు.తిరుపతిలో
స్ధలం తీసుకున్నారు కాని ఆయన ఆశలు తిరకుండానే చనిపోయారు.
ఘంటసాలగారు తన మొదటి పాట "స్వర్గ సీమ" చిత్రం
కోసం పాడితే చివరిపాట "వస్తాడే మాబావ" చిత్రం కోసం పాడారు.

ఘంటసాల మాస్టారు గురించి మంచి విషయములు తెలిపారు..... శంకరరెడ్డిగారు తీయ సంకల్పించిన "శకుంతల" ఏమయింది? కార్యరూపం దాల్చలేదా?...... రాజ్యం పిక్చర్స్ వారు నిర్మించిన "శకుంతల" చూశాను; అది ఆర్థికంగా విజయవంతం కాలేదు.
రిప్లయితొలగించండి