
.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే -
రచన---అన్నమాచార్య
1.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే -
.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే -
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ
2. ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే -
ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే -
మూక మూడు విధములాయరా - ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
3. అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే
అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే
- వొల్వలెల్ల మల్ల్యెయాయే - ఓ వేంకటేశ
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
4. అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే
అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే
- కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా
5. పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే -
పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే -
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా
6. చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే -
చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే -
కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా!
7. గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే
గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే
- కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
8. సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ
సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ --
తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
9. ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ -
ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ -
ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా
10. ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె -
ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె -
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
11. ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె -
ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె -
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
12. ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని
ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని --
మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
13. పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి
పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి - -
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
14. అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని -
అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని -
నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
పద్మావతీ శర్మ గారూ నమస్కారము! మీ బ్లాగ్ లో పోస్ట్ చేయబడిన అన్నమయ్య కీర్తన చూసి చాలా స౦తోష౦ కలిగి౦ది.
రిప్లయితొలగించండిఇటువ౦టిదే మరోకీర్తన "ఎల్లిగాని మల్లిగాని ఏమైన గాని - కొ౦డలరాయడే మా కులదైవము" గత౦లో ఎక్కడో వినడ౦ జరిగి౦ది. అవకాశ౦ ఉ౦టే మీ బ్లాగ్ లో పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు!
కృతజ్ఞతలు"ఎల్లిగాని మల్లిగాని'' పాట అడిగారు కాని"ఎల్లిగాని మల్లిగాని''పాట లేదు నాకు తెలిసి . '' ఎండగాని నీడగాని '' పాత పెడతాను చూడగలరు
తొలగించండిThank you very much.. Madam.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికృతజ్ఞతలు
తొలగించండిmadam,
రిప్లయితొలగించండిee paata ku ardham raaste bbaguntumdani naa korika.
tappakundaa raastanu srinivas reddy gaaru
తొలగించండిI am waiting to know the meaning mam.
రిప్లయితొలగించండి