27, మే 2013, సోమవారం





.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే -
                          
                                      
 రచన---అన్నమాచార్య  
                                         

1.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే -
.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే -
 ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ

2. ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే -
 ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే -
 మూక మూడు విధములాయరా - ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ

3. అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే
 అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే  
- వొల్వలెల్ల మల్ల్యెయాయే - ఓ వేంకటేశ
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

4. అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే 
 అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే 
- కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా

5. పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే -
 పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే -
 పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా

6. చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే -
 చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే -
 కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా!

7. గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే 
 గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే 
- కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

8. సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ 
 సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ --
 తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ

9. ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ -
 ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ -
 ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా

10. ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె -
 ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె -
 దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

11. ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె -
 ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె -
 పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

12. ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని 
 ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని --
 మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

13. పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి
 పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి - -
 కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

14. అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని -
 అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని -
 నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా


8 కామెంట్‌లు:

  1. పద్మావతీ శర్మ గారూ నమస్కారము! మీ బ్లాగ్ లో పోస్ట్ చేయబడిన అన్నమయ్య కీర్తన చూసి చాలా స౦తోష౦ కలిగి౦ది.
    ఇటువ౦టిదే మరోకీర్తన "ఎల్లిగాని మల్లిగాని ఏమైన గాని - కొ౦డలరాయడే మా కులదైవము" గత౦లో ఎక్కడో వినడ౦ జరిగి౦ది. అవకాశ౦ ఉ౦టే మీ బ్లాగ్ లో పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృతజ్ఞతలు"ఎల్లిగాని మల్లిగాని'' పాట అడిగారు కాని"ఎల్లిగాని మల్లిగాని''పాట లేదు నాకు తెలిసి . '' ఎండగాని నీడగాని '' పాత పెడతాను చూడగలరు

      తొలగించండి