14, అక్టోబర్ 2012, ఆదివారం


                             దైవ భక్తీ

                                                                రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్
                                                                              రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు

పూర్వము విశాల దేశాన్ని వినయవర్మ అనే రాజు పాలించేవాడు.అతడు చాల భక్తి పరుడు. శివుని అతి శ్రద్దగా పూజించేవాడు.ప్రతిరోజూ అభిషేకం చేసేవాడు. విష్ణుమూర్తిని ద్వేషించేవాడు కాదు కాని పూజించేవాడు కాదు.తన రాజ్యంలో చాల శివాలయాలు కట్టించాడు.ఎవరైనా శివాలయం కట్టిస్తానంటే ఆర్దిక సహాయం చేసేవాడు అదే విష్ణాలయం కట్టిస్తానంటే వద్దనేవాడు. కాదుకూడదంటే ఆర్దిక సహాయం చేసేవాడు కాదు.విష్ణుపూజ వలన కోరిక తీరవు .ఫలితము ఉండదు అనేవాడుఇలాకొన్నేళ్ళు గడిచాయివినయవర్మకు లావణ్య అనే ఒక కుమార్తె ఉండేది .ఆమె అందం చూచి ప్రక్క రాజ్యం రాజకుమారుడు హర్ష వర్ధనుడుమోహించాడు.తన తండ్రి ద్వారా వినయవర్మకు కబురు పంపించాడు లావణ్యను వివాహం చేసుకుంటానని.వినయవర్మ అగరంగవైభోగంగా వివాహం జరిపించాడు. కొద్దిరోజుల తర్వాత మామగారి భక్తి విషయం తెల్సుకున్నాడుహర్షవర్ధనుడు.శివకేశవులు వేరుకాదని ఇద్దరు ఒకటేనని మామగారికి తెలియ చెప్పాలనుకున్నాడు .తన రాజ్యంలోఒక గుడికట్టించాడు .ఒకేశిలకు ఒకవైపు శివ రూపం మరొక వైపు విష్ణు రూపం చెక్కించాడు. ఆలయానికి పెద్ద ప్రహరికట్టించి శివ రూపం ఉన్న వైపు పెద్ద ద్వారం పెట్టించాడు. విష్ణు రూపం ఉన్న వైపు కూడాపెద్ద ద్వారం పెట్టించాడు. ఏవైపుకు ఆలయం పేరు వ్రాయించాడు. ప్రహరిఒక్కటే. ప్రదక్షిణం ఒక్కటే. గర్భగుడిలో మాత్రం అటువారు ఇటు,ఇటువారుఅటుపోకుండాపెద్దగోడకట్టించాడు.అటుమాటలుఇటు,ఇటుమాటలుఅటువినిపించకుండాజాగ్రత్తలుతీసుకున్నాడు.గొప్పపూజారులను,వేదపండితులనుపిలిపించిశాస్తోక్తంగాప్రాణప్రతిష్టచేయించివిగ్రహప్రతిష్టచేయసంకల్పించాడు.ఆప్రతిష్టకుమామగారినిఆహ్వానించాడు.మామగారినిమేళతాళాలతోఆలయానికితిసుకపోయాడు.శివాలయంమామగారిఆద్వర్యంలోప్రతిష్టచేయించాడు.కానిఆయనకుఅటువైపువిష్ణురూపంఉన్నదనితెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆతర్వాత కొద్దిరోజులు అల్లుని ఇంట విందులు ,వినోదాలు పుచ్చుకొని వినయ వర్మ తనదేశం వెళ్లిపోయాడు. తర్వాత హర్ష వర్ధనుడు విష్ణాలయం ప్రతిష్ట చేయించాడు. స్థలప్రభావము వలననో పూజాఫలాల వలననో ఆలయం దినదిన ప్రవర్ధమానమయింది . ప్రజలు తండోపతండములుగా రాసాగారు. ఎవరు ఏది కోరినవారికి వారి కోరికలు తీరసాగాయి. విషయం చుట్టుపక్కల దేశాలకు పాకింది. వినయ వర్మకు కూడా తెలిసింది. గుడిని దర్శించడానికి అల్లుని రాజ్యానికి వచ్చాడు. గుడి దర్శనం చేసుకున్నాడు. అక్కడికి వచ్చినవారు శివ కేశవుదర్శనం చేసు కోవడం చూచాడు. ఆశ్చర్యం వేసింది. దేవుడు గొప్పవారని వారిని ప్రశ్నించాడు .ఇరువురు గోప్పవారేనని ,ఇరువురు తమ కోరికలు తీరుస్తున్నారని వారుచెప్పారు.ఆయన అల్లుడు ,మంత్రులు కూడా నిజమేనన్నారువిష్ణువు గోప్పవాడైతే తనపై యుద్ధం చేయదానికి సిద్ద పడుతున్న  తన ప్రక్క రాజ్యం రాజు తనతో చెలిమి చేయాలని ,అలా జరిగితే తానుతన రాజ్యంలో విష్ణాలయాలు కట్టిస్తానని అని అన్నాడు. నిజమైన భక్తితో విష్ణాలయంలో పూజ చేశాడు. అయితే అప్పటికే మామ అలుళ్ళబలాలు గమనించిన ప్రక్క రాజ్యపు రాజు వినయ వర్మతో చెలిమికి సిద్దపడ్డాడు. విషయం వినయవర్మకు తెలియదువినయవర్మ తన రాజ్యానికి రాగానే రాజు తన మంత్రిని విశాల రాజ్యానికి పంపి తన చెలిమి విషయం తెలిపాడువినయవర్మకు ఆశ్చర్యం వేసింది. ఇదంతా విష్ణు మహిమేనని అనుకున్నాడు. తన రాజ్యంలో కూడా విష్ణాలయాలు కట్టించడం మొదలు పెట్టాడు. అందరు సంతోషించారు.

2 కామెంట్‌లు: