20, సెప్టెంబర్ 2012, గురువారం

శ్రీ తులసి వైభవము


 
 శ్రీ తులసి వైభవము
                                        రచన :-పి .పద్మావతి శర్మ .ఎం .. తెలుగు పండిట్ .
                                                             రచయిత్రి , గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు
                  
భగవత్ స్వరూపమైన వృక్షాలు రెండు. ఒకటి తులసి,రెండు బిల్వ వృక్షాలు.హిందూవన్నవారు ముఖంగా దక్షిణాదివారు తులసి మొక్కలేని ఇల్లు ఇల్లే కాదంటారు.కులాల కతీతంగా తులసిని పుజిస్తారుమహా లక్ష్మి అంశగా భావిస్తారు.ఆయుర్వేదంలోతులసిని  ప్రాణ శక్తినిచ్చే  శల్య కరణి అని వ్యవహరిస్తారుతులసిలో ముఖ్యంగా   అష్టాదశ (18 ) రకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి ఏడు .లక్ష్మి తులసి,రామ తులసి,కృష్ణ తులసి ,రుద్రజడ తులసి,నెల తులసి,మరువక తులసి ,అడవి తులసి .వివిధ ప్రాంతాలలో వివిధ  పేర్లతో పిలిచినా తులసి చేసే మేలు ఒకటే.లక్ష్మితులసిని తెల్ల తులసి అని, కృష్ణ తులసిని నల్ల తులసి  అని,అలాగే శోంఠి తులసి అని,కర్పూర తులసి అని పిలుస్తూ ఉంటారు.ఆయుర్వేదంలో అన్ని మొక్కలకు  ఏదో ఒక విలువ ఉంటుంది.కాని తులసికి మాత్రం సమానమైన మొక్క లేదు.తులసి అంటేనే సాటి లేనిది  అని అర్ధం. చర్మం ,రక్తం,మాంసం,ఎముకలలో ఎంత మహా రోగం  వచ్చినా తెల్ల తులసితో నయం చేయవచ్చు.  కుష్టు రోగంతో  వికార మైన శరీరాన్ని కృష్ణ తులసితో సహజ సిద్ద రూపం  పొందవచ్చు .అందుకే పూర్వం మునులు ఋషులు తులసిని అధ్బుత మొక్కగా వర్ణించారు.వివిధ పురాణాలలో తులసి జన్మ గాధలు ఒక్కోరకంగా ఉన్నాయి.మచ్చుకు మూడు చెప్పుకుందాం.దేవి భాగవతంలో శ్రీ కృష్ణునితో గోపికలు  ప్రేమగా అడుకునుచుండా అందు ఒక గోపిక కృష్ణునితో  సరస సల్లాపాలు జరుపుతుండగా రాధ చూచి అసూయా చెంది శ్రీ కృష్ణుని,గోపికను భూలోకం లో పుట్టమని శపిస్తుంది.గోపిక బాధపడుతూ శాప విమోచన కోరగా బ్రహ్మ వరంతో శ్రీ హరి అంశకు చేరుతావని శాపవిమోచన చెప్పింది.భూలోకంలో ధర్మ ధ్వజుడను  రాజుకు కార్తిక పున్నమి రోజున గోపిక కుమార్తెగా జన్మించింది.రాజు ఆమెకు తులసి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. చిన్నతనం నుండి శ్రీహరే తన భర్త అని తలుచుకోసాగింది.బ్రహ్మగురుంచి  తపస్సు చేసింది.బ్రహ్మ ప్రత్యేక్షమై శ్రీ హరి అంశతో శంఖచూడుడు అను దాన వుడు జన్మించాడు.అతనిని వివాహం చేసుకొని కాలక్రమేణా గొప్ప వృక్షరాజానివై  దేవతలచేత,మానవులచేత,రాక్షసులచేత పూజ లందు కుంటావని వరం ప్రసాదించాడు.శంఖచూడుడు కూడా బ్రహ్మ వరప్రసాదంతో తులసిని వివాహం చేసుకుని ముల్లోకాలను జయించి దానవ రాజై దేవతలను ఋషులను వేధించసాగాడు.దేవతలు శ్రీహరిని వేడుకోగా శ్రీ హరి శివునితో ఆలోచన చేసాడు.తులసి ప్రాతివత్యమే శంఖ చుడుడిని కాపాడుతున్నదని ఆమె ప్రతివత్యాన్ని చెడగోడితే  అతనిని సంహరించడం సాధ్య మవుతుందని చెబుతాడు. శివుడు శంఖ చుడునికి మాయ మాటలు చెప్పి దూరంగా తిసుకబోగా శ్రీహరి  తులసి భర్తరూపంలో వచ్చి ఆమెను చేరదియగా తులసి విషయం గ్రహించి  నివు వంచనతో నన్ను పొందావు కనుక శిలవై పోదువు గాక అని శపించింది. అప్పుడు విష్ణు మూర్తి ప్రత్యేక్షమై నివు ఎప్పడికైనా నన్ను చేరవలసిన దానవే అనిచెబుతూ శంఖచూడుడు  కూడా నా అంశ వాడే  అనిచెప్పి అయినా నీ శాపం వృధా పోదు అని నీ శరిరం గండకి నదిగాను,నీ కేశములు తులసి వృక్షముగాను నేను  సాల గ్రామశిలగాను  శంఖచూడుడు శంఖముగాను మారి పోతాము.శంఖము,తులసి సాలగ్రామశిల మూడింటిని  కలపి
పూజిం చినవారు  నాకు అత్యంత పితిపాత్రులై వైకుంఠ  వాసులవుతారు.అనిచెప్పాడు. పద్మ పురాణంలోకూడా దాదాపు ఇదే కధ వున్నా  తులసి జలంధరునికి భార్యగాను ఉండి చివరకు జలంధరుడు అత్తిపత్తి మొక్కగా మారతాడు.అందుకని తులసిని అత్తిపత్తి మొక్కను కలసిపెంచి పూజించడం శ్రేష్టదాయకం అనిఉంది.బృహన్నరదియంలో పూర్వం ధర్మదేవుడనే బ్రాహ్మణునికి తులసి బృంద అనే నామంతో భార్యగా ఉండేది.బృంద పతియే ప్రత్యేక్షదైవంగా భావించేది.ధర్మదేవుడు ఋషులను ,మునులను పూజిస్తూ దైవ కార్యాలు చేస్తూ ఉండేవాడు.ఒకరోజు ధర్మదేవుడు దైవ ప్రార్ధన చేస్తూ మధ్యాన్న బోజన కాలమైనా ఇంటికి రాలేదు.అతిధులు బోజనానికి వేచి ఉన్నారు. అందుకని బృంద అతిధులను పూజించి వారికి ఆతిధ్యం  ఇచ్చి బాగా దాహం అవుతుండటంతో జల పానం(నీరు త్రాగటం)  చేసి భర్త రాకకై ఎదురు చూడ సాగిందికొంతసేపటి  తరువాత భర్త ఇంటికి వచ్చి క్షణికావేశంలో జల పానం చేసిన భార్యను రాక్షసివి కమ్మని శపించాడు. బృంద దుఃఖముతో  శాపవిమోచన కోరగాఒకవారందినములుఆహారంతిసుకోనకుండా
 ఉంటె శాప విమోచన జరుగు తుందని చెబుతాడుబృంద రాక్షసిగామారి రాక్షస్వభావంతో మనుషులను,జంతువులను చంపి ఆహారంగా తింటూ ఉంటుంది.కానీ పూర్వజన్మ సృతివల్ల గోవులను హరి భక్తులను ,బ్రాహ్మణుల జోలికి పోకుండా వారిని గౌర విస్తు ఉంటుంది.అలాచాలారోజులు జరిగాక తిరుగుతూ తిరుగుతూ కైలాసం వస్తుంది.అక్కడ అంతా హరిహర భక్తులే.చెట్లు,జంతువులుకుడా హరినామం జపిస్తూ ఉంటాయి.అక్కడ ఏమి తినలేక వారంరోజులు పస్తు ఉంటుంది.శాపనియమానుసారం ఒకవనంలో దేహం చాలిస్తుందిశివుడు పార్వతి ఒక సంవత్సరం తరువాత వనమునకు  పోగా అక్కడ బృంద శరీరము  వింత కాంతులు  వెలయిస్తూ ఉంటుంది.అప్పుడు శివుడు పార్వతితో " దేహంలో  ద్వాదశాక్షరి అణువణువునా కనిపిస్తున్నది.కావున  దేహం వృధా పోరాదు .భూలోకంలో గొప్ప  వృక్షరాజంగా వెలసి విష్ణుమూర్తికి ప్రియమైనదిగా పూజలందు కుంటుందని వరం ఇచ్చాడు.ధర్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుని ప్రార్ధించగా తులసి చెట్టు వేరుగా ఉండమని వరం ఇచ్చాడుశివకేశవులు తులసి ఆవిర్భావాన్ని భూలోకంలో చూచారు. అప్పుడు విష్ణు మూర్తి తులసితో ఒతులసి!నివు స్త్రీలలో ఉత్తమురాలివి సూర్య,చంద్రులు ఉన్నంతవరకు నివు నిలిచేఉంటావు. నాపుజకు నీ దళాలే శ్రేష్టమయినవి.నీకు ప్రదక్షిణం చేస్తే భుప్రదక్షిణం చేసినట్లే.కార్తిక మాసంలో కాని మాఖ మాసంలోకానినిపత్రాలతోనన్నుపూజిస్తేసహస్రగోదానఫలితదక్కుతుంది.   (ఇంకా ఉంది )
                            ఆగస్ట్ 12 చైతన్యం మాస పత్రికలో ప్రచురించ బడినది                                                   

1 కామెంట్‌:

  1. అమ్మా ఆసాంతం చదివినాను మరి తులసి వినాయకుని గాథ కూడా ప్రాచుర్యం పొందింది ఎక్కడిదొ తెలియదు విపులంగా వివరించ మనవి

    రిప్లయితొలగించండి