6, జులై 2011, బుధవారం

చిన్నారి జాబిలివే


రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .


చిన్నారి జాబిలివే మరువంపు మొలకవే
మా ఇంటపుట్టిన సిరి మల్లె
పూవువే
సిరిమల్లె పూవువే !!చిన్నారి !!
నీ నవ్వే జలపాతం నీ మాటలే అనురాగం
నీఅలకల ఆటలే మాఇంట వెన్నలలే
మా ఇంట వెన్నలలే !!చిన్నారి !!
మా కంటి పాపవే మా ఇంటి జ్యోతివే
మా ఇంట పుట్టిన బంగారు తల్లివే
బంగారు తల్లివే !!చిన్నారి !!
నీ కంట కన్నీరు మేమసలె చూడొద్దు
నీ
వేది అడిగిన కాదనుటే లేదు
కాదనుటే లేదు!!చిన్నారి !!
నీ ఆటలపాటలతో నీ నవ్వుమాటలతో
అందరిని అలరించే నువ్వేకావాలి
నువ్వేకావాలి !!చిన్నారి !!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి