2, జూన్ 2013, ఆదివారం

త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు

 












త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు            
           
                                        రచన ---అన్నమాచార్య
                                         రాగం -- చక్రవాకం 
      

|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును |
వొకటి కోటిగుణితంబగుమార్గములుండగ బ్రయాసపడనేలా ||

|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి |
కనకబిందుయమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు |
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా ||

|| హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు |
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు |
పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు |
పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా |

|| మొదల శ్రీవేంకటపతికిని జేయెత్తి మొక్కినమాత్రములోపలనే |
పదిలపుషోడశదానయాగములుపంచమహాయజ్ఞంబులును |
వదలక సాంగంబులుగా జేసినవాడే కాడా పలుమారు |
మదిమదినుండే కాయక్లేశము మాటికి మాటికి దనకేలా
||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి